Covid Cases in India Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొత్తగా 8,954 మంది కొవిడ్ బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 267 మంది మృతి చెందారు. ఒక్కరోజే 10,207 మంది వైరస్‌ను జయించారు. దీంతో కరోనా క్రియాశీలక కేసులు.. లక్ష దిగువకు చేరాయి.
- మొత్తం కేసులు: 3,45,79,228
- మొత్తం మరణాలు: 4,69,247
- యాక్టివ్ కేసులు: 99,023
- మొత్తం కోలుకున్నవారు: 3,40,28,506
టీకాల పంపిణీ
మంగళవారం ఒక్కరోజే 80,98,716 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం టీకాల పంపిణీ.. 1,24,10,86,850 కు చేరింది.
అంతర్జాతీయంగా..
coronavirus worldwide: ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే 5,85,319 మందికి కరోనా సోకింది. మరో 7,617 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 26,30,35,743 కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 52,33,046కు చేరింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు.. మరణాలు
- అమెరికాలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కొత్తగా 1,06,876 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 1,438 మంది మరణించారు.
- జర్మనీలో ఒక్కరోజే 55,880 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 485 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో తాజాగా 39,716 మంది కొవిడ్ బారిన పడ్డారు. మరో 159 మంది మరణించారు.
- రష్యాలో మరో 32,648 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 1,229 చనిపోయారు.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 47,177 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. మరో 115 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 25,216 మందికి కరోనా నిర్ధరణ కాగా.. 207 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: Covishield efficiency: 'కరోనా రెండో దశలో కొవిషీల్డ్ ప్రభావశీలత 63%'