ETV Bharat / bharat

హిందూ మతంలోకి వక్ఫ్​ బోర్డ్ మాజీ ఛైర్మన్- జితేంద్ర త్యాగీగా పేరు మార్పు

Waseem Rizvi converted to Hinduism: షియా వక్ఫ్​ బోర్డ్​ మాజీ ఛైర్మన్​ వసీమ్​ రిజ్వీ హిందూ మతాన్ని స్వీకరించారు. తన పేరును జితేంద్ర నారాయణ్​ సింగ్​ త్యాగీగా మార్చుకున్నారు.

author img

By

Published : Dec 6, 2021, 3:52 PM IST

Updated : Dec 6, 2021, 4:11 PM IST

Waseem Rizvi converted to Hinduism
హిందూ మతంలోకి వసీమ్​ రిజ్వీ
హిందూ మతంలోకి వక్ఫ్​ బోర్డ్ మాజీ ఛైర్మన్ వసీమ్​ రిజ్వీ

Waseem Rizvi converted to Hinduism: ఉత్తర్​ప్రదేశ్​ షియా వక్ఫ్​ బోర్డ్​ మాజీ ఛైర్మన్, ముస్లిం నేత​ సయ్యద్​ వసీమ్​ రిజ్వీ ఇస్లాంను వదిలి.. హిందూ మతాన్ని స్వీకరించారు. గాజియాబాద్​లోని డాసనా దేవి ఆలయంలో నరసింహానంద సరస్వతి మహారాజ్​ ఆధ్వర్యంలో హైందవ సంప్రదాయ పద్ధతుల్లో హిందువుగా మారారు. తన పేరును జితేంద్ర నారాయణ్​ సింగ్​ త్యాగీగా మార్చుకున్నారు.

Waseem Rizvi
శివలింగానికి అభిషేకం చేస్తున్న వసీమ్​ రిజ్వీ

డాసనా దేవి ఆలయంలో కార్యక్రమాల అనంతరం మాట్లాడిన రిజ్వీ.. తనను కొందరు ఇస్లాం నుంచి వెళ్లగొట్టినట్లు చెప్పారు. ఎందుకు మతం మారారని ప్రశ్నించగా.. ఇక్కడ మతమార్పిడి అనేది లేదని పేర్కొన్నారు.

"ఇస్లాం నుంచి బయటకు పంపించాక ఏ మతం తీసుకోవాలనేది నా ఇష్టం. ప్రపంచంలో సనాతన ధర్మమే తొలి మతం. అందులో ధర్మం, మానవత్వం ఉంది. అది ఏ మతంలోనూ లేదని నేను నమ్ముతున్నా."

- జితేంద్ర నారాయణ్​ సింగ్​ త్యాగీ(వసీమ్​ రిజ్వీ)

గాజియాబాద్​లోని డాసనా దేవి ఆలయంలో సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత హిందువుగా నామకరణం చేసినట్లు చెప్పారు యతి నరసింహానంద సరస్వతి. త్యాగీ వర్గం ప్రజలు సమావేశమై చర్చించుకున్న తర్వాతే జితేంద్ర నారాయణ్​ సింగ్​ త్యాగీ పేరును ఎంపిక చేసినట్లు చెప్పారు. త్యాగీ తన సోదరుడని, ఇప్పటి నుంచి తన తండ్రికి ఇద్దరు కుమారులని తెలిపారు. చాలా సంతోషంగా ఉందన్నారు.

Waseem Rizvi
డాసనా దేవి ఆలయంలో వసీమ్​ రిజ్వీ
Waseem Rizvi
సంప్రదాయం ప్రకారం పేరు మార్చుతున్న మత గురువులు

గతంలోనే వెల్లడించిన రిజ్వీ..

హిందూ మతం స్వీకరించాలనుకుంటున్నట్లు కొద్ది రోజుల క్రితం ఓ వీడియో ద్వారా సందేశం అందించారు రిజ్వీ. తన మరణానంతరం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ఖననం చేయొద్దని కోరారు. తన పార్థివదేహాన్ని హిందూ స్నేహితుడు, మహంత్​ నరసింహానంద సరస్వతికి అప్పగించాలని సూచించారు. ఆయనే తన చితికి నిప్పు పెట్టాలనే తన కోరికను వెల్లడించారు. కొంత మంది తనను చంపాలనుకుంటున్నారని, మరణానంతరం తన శరీరాన్ని ముస్లిం స్మశానంలోకి అనుమతించమని చెబుతున్నారని తెలిపారు.

ముస్లింల ఆగ్రహం..

ఖురాన్​లోని 26 వాక్యాలను తొలగించాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేసిన క్రమంలో ముస్లింల ఆగ్రహానికి లోనయ్యారు రిజ్వీ. వీటిని హజ్రత్​ అబూ బకర్​, హజ్రత్​ ఉమర్​, హజ్రత్​ ఉస్మాన్​ తొలి ఖలీఫా ఖురాన్​లోకి చొప్పించారని, జిహాద్​ను ప్రోత్సహించేందుకు ఉగ్రవాదులు వీటిని ఉపయోగిస్తున్నట్లు పిటిషన్​లో పేర్కొన్నారు.

ఈ 26 వాక్యాలను తొలగించి సరికొత్త ఖురాన్​ను సిద్ధం చేసినట్లు చెప్పారు రిజ్వీ. ఒక కాపీని ప్రధాని మోదీకి పంపించినట్లు చెప్పారు. మదర్సాలు, ముస్లిం విద్యా సంస్థల్లో కొత్త ఖురాన్​ ఉపయోగించేలా చూడాలని మోదీకి లేఖ రాసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: భారత్​ 'ఆపరేషన్​ ట్రైడెంట్​'.. పాక్ వెన్నులో వణుకు

Last Updated : Dec 6, 2021, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.