భారత్-చైనా సరిహద్దులో 3,205 కిలోమీటర్ల పొడవుగల 59 రహదారుల అనుసంధానం పూర్తయినట్లు రాజ్యసభ వేదిగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. 3,323.57 కి.మీల పొడవైన 61 రహదారులు వ్యూహాత్మకంగా కీలకమైనవిగా గుర్తించినట్లు చెప్పారు. వాటి అనుసంధాన ప్రక్రియను సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ(బీఆర్ఓ)కు అప్పగించినట్లు తెలిపారు.
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు రాజ్‌నాథ్.
61లో మిగిలిన రెండు రహదారుల పొడవు 118.41 కిలోమీటర్లు కాగా.. అనుసంధానించని భాగం 29 కిలోమీటర్లు మాత్రమేనని చెప్పారు. 1530.38 కి.మీల మేర 43 రోడ్లు నిర్మాణం పూర్తయినట్లు వెల్లండిచారు.
తూర్పు లద్దాఖ్‌లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్టంభన, సరిహద్దుల్లో చైనా ఉద్ధృతంగా చేపడుతోన్న మౌలిక వసతుల ప్రాజెక్టుల నేపథ్యంలో సరిహద్దుల్లో అనుసంధాన ప్రక్రియ పనులను మెరుపు వేగంతో చేపడుతోంది భారత్.
10 ఐసీబీఆర్ రోడ్లను ఈ నెలలో, ఏడింటిని వచ్చే ఏడాది మార్చి నాటికి, మరో రెండింటిని 2023 మార్చి కల్లా పూర్తి చేస్తామని రాజ్‌నాథ్ తెలిపారు. పనులు త్వరగా పూర్తి చేయడానికి అదనపు అధికారాలు, ఆర్థిక వనరులను బీఆర్ఓ అధికారులకు ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: 33% తగ్గిన భారత ఆయుధాల దిగుమతి!