ETV Bharat / bharat

'సెంట్రల్​ విస్టాపై కాంగ్రెస్​ అసంతృప్తికి కారణం అదే' - అనురాగ్​ ఠాకూర్​

సెంట్రల్​ విస్టా ప్రాజెక్టుకు గాంధీ కుటుంబం పేరు పెట్టకపోవడంపై కాంగ్రెస్​ పార్టీ అసహనం ప్రదర్శిస్తోందని కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​ అన్నారు. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న మెగా ప్రాజెక్టులపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

anurag thakur
అనురాగ్​ ఠాకూర్​
author img

By

Published : Jun 4, 2021, 11:29 PM IST

సెంట్రల్​ విస్టా ప్రాజెక్ట్​కు గాంధీ కుటుంబం పేరు పెట్టకపోవడంపై కాంగ్రెస్​ పార్టీ అసంతృప్తిగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్ అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి మెగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంటే వాటి మీద నోరు మొదపరేమని ప్రశ్నించారు. సెంట్రల్​ విస్టా ప్రాజెక్టు భారతీయులందరిదని నొక్కి చెప్పిన మంత్రి.. ఇది రాబోయే రోజుల్లో పేదల జీవితాలను మార్చే విధానాలు, కార్యక్రమాలను రూపొందిస్తుందని పేర్కొన్నారు. భారత దేశాన్ని ఆర్థిక శక్తిగా నిలబెడుతుందని పేర్కొన్నారు.

"సెంట్రల్​ విస్టాకు గాంధీ కుటుంబం పేరు పెట్టకపోవడంపై కాంగ్రెస్​ అసహనం ప్రదర్శిస్తోంది. ఈ అవకాశాన్ని కోల్పోయినందుకు చింతిస్తుంది. హస్తం పార్టీకి ప్రస్తుతం పౌరసత్వ పాఠాలు అవసరం. అధికారిక నివాసాలు, ప్రభుత్వ కార్యాలయాలు దేశ ప్రజలకు చెందినవి. వ్యక్తులకు చెందినవి కాదని ఆ పార్టీ సభ్యులు గుర్తు పెట్టుకోవాలి."

- అనురాగ్​ ఠాకూర్​, కేంద్రమంత్రి

సెంట్రల్ విస్టా పనులను వ్యతిరేకిస్తున్న రాహుల్​ గాంధీ.. కాంగ్రెస్​ పాలిత ప్రాంతాల్లో చేపట్టిన బడా ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలని కోరారు.

ఇదీ చూడండి: పద్మ అవార్డు గ్రహీతల ఎంపికకు ఇక కొత్త పద్ధతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.