ETV Bharat / bharat

15న గవర్నర్​ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్​ ఆందోళనలు - కేసీ వేణగోపాల్

రైతు నిరసనలకు సంఘీభావంగా జనవరి 15న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్​ నిర్ణయించింది. ఈ మేరకు 'కిసాన్​ అధికార్​ దివస్​' పేరిట రైతులకు మద్దతుగా గవర్నర్​ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపట్టనుంది. దీంతోపాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ధర్నాలకు పిలుపునిచ్చింది.

Congress to stage protest outside all Governor Houses across the country on January 15
'కిసాన్​ అధికార్​ దివస్​' పేరిట కాంగ్రెస్​ నిరసనలు
author img

By

Published : Jan 9, 2021, 9:14 PM IST

దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతుగా జనవరి 15న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్​ ప్రకటించింది. 'కిసాన్​ అధికార్​ దివస్​' పేరిట గవర్నర్​ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులతో నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

'కిసాన్​ అధికార్​ దివస్'​లో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు.. కాంగ్రెస్​ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ గైర్హాజరయ్యారు.

రైతుల ప్రాణాలు పోతున్నా..

మోదీ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల కాలయాపన చేస్తోందని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్​ సింగ్​ సుర్జేవాలా విమర్శించారు. కేంద్రం మొండి వైఖరి, బాధ్యతారాహిత్యంతో రైతుల ప్రాణాలు పోతున్నాయని ఆరోపించారు. సమస్యను పరిష్కరించలేక సుప్రీంకోర్టుకు వెళ్లాలని నేతలు సూచించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. 'కాంగ్రెస్​ పార్టీ రైతులకు మద్దతుగా నిలుస్తుంది, సమస్యల పరిష్కారానికి పూర్తి కృషి చేస్తుంద'ని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఇంటికి..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.