ETV Bharat / bharat

'విద్వేష బజార్ బంద్.. ప్రేమ దుకాణం ఓపెన్'.. కర్ణాటక ఫలితంపై రాహుల్ - కర్ణాటక ఎన్నికల న్యూస్

Karnataka election results 2023 : కర్ణాటకలో కాంగ్రెస్​కు మెజార్టీ కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. కర్ణాటకలో విద్వేష బజార్ మూతబడిందని.. ప్రేమ దుకాణం తెరుచుకుందని అన్నారు. మరోవైపు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

Karnataka election results 2023
Karnataka election results 2023
author img

By

Published : May 13, 2023, 4:41 PM IST

Updated : May 14, 2023, 3:46 PM IST

Karnataka election results 2023 : కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది కర్ణాటక ప్రజల విజయమని రాహుల్‌ కొనియాడారు. తాము ద్వేషం, చెడు పదాలు ఉపయోగించకుండా కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసినందుకు సంతోషంగా ఉన్నానని ఆయన అన్నారు. ప్రేమతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడిందని పేర్కొన్నారు.

"కర్ణాటకలో విద్వేష బజార్‌ మూతబడింది. ప్రేమ దుకాణం తెరుచుకుంది. ఇది అందరి విజయం. ముఖ్యంగా కర్ణాటక ప్రజల విజయం. మేం ఎన్నికల్లో 5 హామీలు ప్రజలకు ఇచ్చాం. మొదటి కేబినెట్‌ సమావేశంలోనే వాటిని అమల్లోకి తెస్తాం. కర్ణాటక ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చెబుతున్నాను."

--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

'విద్వేష బజార్ బంద్.. ప్రేమ దుకాణం ఓపెన్'.. కర్ణాటక ఫలితంపై రాహుల్

దేశాన్ని ఏకం చేసే విజయం..
కర్ణాటకలో పార్టీ విజయంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పనితీరు.. దేశాన్ని ఏకం చేసే రాజకీయాల విజయమని ఆమె అభిప్రాయపడ్డారు. 'కాంగ్రెస్ పార్టీకి చారిత్రక విజయాన్ని అందించినందుకు కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరికీ నా శుభాకాంక్షలు. మీ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ప్రజలకు ఇచ్చిన హామీలకు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. జై కర్ణాటక.. జై కాంగ్రెస్' అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

మోదీ శుభాకాంక్షలు​..
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు. పార్టీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నా. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తాం' అని ట్వీట్ చేశారు.

బీజేపీ ఓటమికి నాదే బాధ్యత: బొమ్మై
కర్ణాటక ప్రజల ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నట్లు సీఎం బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పార్టీ కార్యకర్తల వరకు అంతా శ్రమించినా కూడా సానుకూల ఫలితాలు రాలేదన్నారు. మొత్తం ఫలితాలను విశ్లేషించి లోపాలను సరిదిద్దుకొని.. 2024 పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కానున్నట్లు బొమ్మై చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు బొమ్మై ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని తెలిపారు. వాటన్నింటిని తెలుసుకుని.. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరోసారి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

'ప్రధాని నుంచి పార్టీ కార్యకర్తల వరకు అందరం తీవ్రంగా శ్రమించినా కూడా మేం మెజార్టీ సాధించలేకపోయాం. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. మొత్తం ఫలితాలు వచ్చాక విశ్లేషణ చేసుకుంటాం. ఎక్కడా లోపాలు ఉన్నాయో చూస్తాం. వివిధ స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకుంటాం'

--బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

బీజేపీకి గెలుపు, ఓటములు కొత్త కాదు..
బీజేపీకి గెలుపు, ఓటములు కొత్త కాదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అగ్రనేత యడియూరప్ప అన్నారు. ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటామని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాలపై కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని తెలిపారు.

'క్రూరమైన రాజకీయాలు ఓడిపోయాయి'
కర్ణాటకలో క్రూరమైన, నిరంకుశ రాజకీయాలు ఓడిపోయాయని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మార్పు కోసం ఓటేసిన కన్నడ ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

'2024 లోక్​సభ ఫలితాలకు దిక్సూచి'
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని ప్రధాని మోదీ, హోం అమిత్​ షా ఓటమిగా అభివర్ణించారు శివసేన(ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్​ రౌత్​. బజరంగ్ బలీ 'గద' బీజేపీపై పడిందని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు కర్ణాటక ఫలితాలు నిదర్శనమని రౌత్ అభిప్రాయపడ్డారు.

మోదీ అజేయుడు కాదు: ప్రతిపక్షాలు
కాంగ్రెస్‌ పార్టీని గెలిపించిన కర్ణాటక ప్రజలకు పలువురు ప్రతిపక్ష నేతలు కృతజ్ఞతలు తెలిపారు. మోదీ అజేయుడు కాదని కర్ణాటక ఫలితాలతో తేలిందన్నారు. పేదలకు మేలుచేసే హామీలు, సెక్యులర్‌ వైఖరి కాంగ్రెస్‌ పార్టీకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టాయని కొనియాడారు. అవసరమైన పాఠాలు నేర్చుకోవడం సహా జాతీయ రాజకీయాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని ప్రతిపక్ష పార్టీల నేతలు కోరారు. సెక్యులర్‌ పార్టీలన్నీ ఏకమైతే 2024 ఎన్నికల్లో బీజేపీ రాజ్‌ ముగుస్తుందని అభిప్రాయపడ్డారు.

బజరంగ్‌బలిని కాకుండా ఎల్‌పీజీని ఎన్నుకున్నందుకు కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు అంటూ టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్రా ట్వీట్‌ చేశారు. సీపీఐ-ఎంఎల్‌ నాయకుడు దీపాంకర్‌ భట్టచార్య కూడా కర్ణాటక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి, పనిచేయని బొమ్మై సర్కార్‌తోపాటు ద్వేషంతో నిండిన అహంకార మోదీ-షా ప్రచారాన్ని కూడా ప్రజలు తిరస్కరించారని ఆయన ట్వీట్‌ చేశారు.

కాంగ్రెస్​కు అభినందనలు..
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆప్ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అభినందనలు తెలిపారు. ఇకపై తమ వ్యూహాలు పని చేయవని బీజేపీ గ్రహించాలని అన్నారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 224 శాసనసభ స్థానాలకుగాను 135 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 66 స్థానాల్లో గెలుపొందింది. జేడీఎస్ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. కర్ణాటకలో మే 10న ఎన్నికల పోలింగ్ జరిగింది. మే 13న ఫలితాలు వెలువడ్డాయి.

Last Updated : May 14, 2023, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.