కేంద్ర ప్రభుత్వ సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వినూత్నంగా నిరసన తెలిపారు. దిల్లీ సరిహద్దుతో పాటు జంతర్‌మంతర్ వద్ద రైతులు చేపట్టిన నిరసనకు మద్దతుగా ట్రాక్టర్‌పై ప్రయాణించారు. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ.. పార్లమెంట్‌కు వెళ్లారు రాహుల్.
![Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12574517_e7mr0bzvoambfpz-1.jpg)
![Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12574517_e7msdhtvoaanksj.jpg)
"రైతుల సందేశాన్ని నేను పార్లమెంటు వరకు తీసుకొచ్చాను. కేంద్రం.. రైతుల గొంతుకను నొక్కేస్తోంది. పార్లమెంటు సమావేశాల్లో రైతుల అంశాలపై చర్చించటం లేదు. సాగు చట్టాలను రద్దు చేయాలి. ఈ చట్టాలు కేవలం 2-3 వ్యాపారవేత్తలకే లాభం చేకూరుస్తాయని దేశ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. రైతులు ఆనందంగా ఉన్నారని కేంద్రం భావిస్తోంది. పార్లమెంటు వెలుపల నిరసన తెలిపేవారు.. ఉగ్రవాదులని ముద్ర వేస్తోంది. రైతుల హక్కులను కేంద్రం హరిస్తోంది."
-- రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేత
రాహుల్‌తో పాటు పలువురు నాయకులు ఆయన వెంటే ట్రాక్టర్‌పై ప్రయాణించారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమంటూ ఈ సందర్భంగా పలువురు బ్యానర్లు ప్రదర్శించారు.
![Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12574517_e7msdhtvoaanksj.jpg)
![Congress leader Rahul Gandhi drives a tractor to reach Parliament](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12574517_e7mr0bzvoambfpz-3.jpg)
చైనాను అలానే వదిలేస్తారా?
చైనాతో ఎలా వ్యవహరించాలో కేంద్రానికి అర్థంకావటం లేదని రాహుల్ విమర్శించారు. సరిహద్దులో చైనా కార్యకలాపాలను వదిలేస్తే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు.
ఈ మేరకు.. తూర్పు లద్దాఖ్‌లోని దెంచోక్ ప్రాంతంలో చైనా సైన్యం మోహరించిందంటూ.. ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనాలపై రాహుల్ స్పందించారు. వాటిని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా కూడా.. చైనా విషయంలో కేంద్రంపై విమర్శలు చేశారు. మన దేశ సరిహద్దు నుంచి చైనా సైన్యాన్ని తరిమేయాలని ట్వీట్ చేశారు.
గతేడాది మే 5నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సరిహద్దులోని ఘర్షణ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ కోసం ఇప్పటికే 11 విడతల సైనిక చర్చలు జరిగాయి.
ఇవీ చదవండి: