రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గేని గుర్తిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో మార్పులకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకారం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు వెంకయ్య. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే.. మంగళవారం నుంచి ఎగువసభలో ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగనున్నారు.
ఇవీ చూడండి: మోదీ కంటతడి- ఆజాద్‌కు సెల్యూట్!