ప్రతిష్ఠాత్మక క్వాడ్ సమావేశాలపై కాంగ్రెస్ స్పందించింది. క్వాడ్ ద్వారా భారత్ గరిష్ఠ ప్రయోజనాన్ని పొందాలని అభిప్రాయపడింది. ఈ కూటమి వల్ల భారత్‌కు కలిగే ప్రయోజనాలని కేంద్రం ప్రజలకు వివరించాలని సూచించింది. కేవలం ఓ దేశ అజెండాగా క్వాడ్‌ను పరిమితం కాకూడదని పేర్కొంది.
"ప్రతి సభ్యదేశం సమానంగా లాభపడుతుందనే విషయంపై స్పష్టత లేదు. క్వాడ్‌కు సంబంధించి ఉన్న ఎన్నో ప్రశ్నలకు ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వలేకపోయింది."
-పవన్ ఖెరా, కాంగ్రెస్ ప్రతినిధి
ఇదీ చదవండి : 'ఆయుర్వేద ప్రాచుర్యానికి ఇదే సరైన సమయం'