Harihara Krishna Father Comments On Naveen Murder: అబ్దుల్లాపూర్‌మెట్‌లో స్నేహితుడి చేతిలో అతికిరాతకంగా చనిపోయిన నవీన్ కుటుంబ సభ్యులకు నిందితుడైన హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ క్షమాపణ చెప్పారు. అమ్మాయి ట్రాప్‌లో పడి ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయాయనిని అన్నారు. ఒకరు చనిపోతే మరొకరు జైలు పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హరిహర కృష్ణ శివరాత్రి పండుగ రోజున వరంగల్‌కు వచ్చాడని ఆరోజు హరిహర కృష్ణకి ఎక్కవ ఫోన్లు వచ్చాయని తండ్రి ప్రభాకర్ తెలిపారు.
ఏదో అలజడిగా ఉన్న తీరు గుర్తించి.. ఏం జరిగిందని కొడుకుని అడిగితే, ఏమీ లేదంటూ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడని ప్రభాకర్ చెప్పారు. ఆ తరువాత రెండు రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. అప్పటికే నవీన్ కనబడట్లేదని మిస్సింగ్ కేసు నమోదు అయిందన్నారు. తమ అబ్బాయి కూడా కనపడకపోవడంతో తాము కూడా పోలీసులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. హరిహర కృష్ణ మళ్లీ 23వ తారీఖు వరంగల్ వచ్చాడని వెల్లడించారు.
Harihara Krishna Father Comments: 'ఆరోజు ఏం జరిగిందని నిలదీస్తే.. నవీన్‌కి హరిహర కృష్ణ మధ్య గొడవ జరిగినట్టు చెప్పాడు. ఈ గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పడంతో పోలీసులకు లొంగిపోవాలని చెప్పాను. పోలీసుల దగ్గరికి తీసుకెళ్దామంటే రేపు హైదరాబాదులోనే పోలీసులకు లొంగిపోతానని చెప్పి వెళ్లిపోయాడు. శనివారం రోజున హైదరాబాద్‌లో పోలీసుల దగ్గర లొంగిపోయాడని తెలిసింది.' అని హరిహర కృష్ణ తండ్రి తెలిపారు.
తప్పు చేసింది ఎవరైనా.. తప్పు తప్పే అని హరికృష్ణ తండ్రి ప్రభాకర్ అన్నారు. తన కొడుకు ఒక్కడే అంత కిరాతకంగా హత్య చేయడం సాధ్యం కాదని, ఇంకా ఈ హత్య వెనుక ఎవరో ఉన్నారని ఆరోపించారు. హత్య కేసుపై పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపించాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబ సభ్యులను క్షమించమని వేడుకుంటున్నామని ప్రభాకర్ అన్నారు. హరిహర కృష్ణ, నవీన్ ఇద్దరు ఇంటర్ నుంచి మంచి స్నేహితులేనని, ఒక అమ్మాయి మూలంగా ఇద్దరు జీవితాలు పాడైపోయాయని వాపోయారు. అమ్మాయిల ట్రాప్‌లో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువకులకు సూచించారు.
ఇవీ చదవండి: