ETV Bharat / bharat

బొగ్గు గనుల్లో ప్రమాదం.. ఆరుగురు మృతి

Coal Mine Collapse: ఝార్ఖండ్​లోని ధన్​బాద్​ జిల్లాలో బొగ్గు గనుల పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Coal Mine Accidents
బొగ్గుగని
author img

By

Published : Feb 1, 2022, 7:49 PM IST

Coal Mine Collapse: బొగ్గు గనుల పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గనుల్లో చిక్కుకున్నారు. ఈ ఘటన ఝార్ఖండ్​లోని ధన్​బాద్​ జిల్లాలో జరిగింది. మూసివేసిన ఈ గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

coal mine accidents
బొగ్గు గనున్న సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది
Coal Mine Accidents
ఘటనాస్థలం

ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు అధికారులు. ఈస్ట్రెన్​ కోల్​ఫీల్డ్​ లిమిటెడ్ (ఈసీఎల్​)కు చెందిన గని నుంచి బయటపడ్డ మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నట్లు తెలిపారు. కాపాసరలోని ఈసీఎల్​, ఛాచ్​ విక్టోరియా ఆఫ్​ భారత్​ కోకింగ్​ కోల్​ లిమిటెడ్​ (బీసీసీఎల్​)కు చెందిన గనుల్లో కూడా మృతులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మొదటగా సోమవారం సాయంత్రం 5గంటలకు కాప్సరా ఔట్​సోర్సింగ్​ ప్రాజెక్ట్ వద్ద గని కూలిందని, ఆ తర్వాత కొన్ని గంటలకు బీసీసీఎల్​ వద్ద గని. మంగళవారం ఉదయం గోపీనాథ్​పుర్​ వద్ద గనుల్లో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భారీ యంత్రాలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.

సీఎం దిగ్భ్రాంతి

గనుల్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన సీఎం.. గనుల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేయమని ఆదేశించినట్లు తెలిపారు. గాయపడిన వారికి సత్వర చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి : దేవుడిపై కోపంతో విగ్రహాలు ధ్వంసం- తనవాళ్లకు హాని జరిగిందని...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.