Vande Bharat Express Catches Fire : మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి దిల్లీకి వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం సి-12 కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగడాన్ని కొందరు రైల్వే సిబ్బంది గమనించారు. వెంటనే రైలును విదిషా జిల్లాలోని కుర్వాయ్, కైథోరా స్టేషన్ల మధ్య నిలిపివేశారు. అనంతరం ఆ కోచ్‌లో ఉన్న సుమారు 22 మంది ప్రయాణికులను సురక్షితంగా ఇతర కోచ్‌లలోకి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
"రాణి కమలాపతి స్టేషన్ నుంచి నిజాముద్దీన్ టైర్మినల్ వరకు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్-20171 బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగి పొగ వ్యాపించింది. రైలును కుర్వాయి,కేథొరా స్టేషన్‌ల మధ్య నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఎవరికీ గాయాలు కాలేదు. బ్యాటరీ బాక్స్ సమస్యను సరిదిద్దాం."
--రాహుల్ శ్రీవాస్తవ, పశ్చిమ మధ్య రైల్వే సీపీఆర్ఓ
-
#WATCH | Rahul Shrivastava, West Central Railway Chief Public Relations Officer says, "Report of a fire in the battery box of Vande Bharat Express 20171, that plies from Rani Kamlapati Station to Nizamuddin was received. Smoke was seen. The train was stopped at Kurwai Kethora… https://t.co/Z9FUYma5V6 pic.twitter.com/N8THI8CaHO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Rahul Shrivastava, West Central Railway Chief Public Relations Officer says, "Report of a fire in the battery box of Vande Bharat Express 20171, that plies from Rani Kamlapati Station to Nizamuddin was received. Smoke was seen. The train was stopped at Kurwai Kethora… https://t.co/Z9FUYma5V6 pic.twitter.com/N8THI8CaHO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023#WATCH | Rahul Shrivastava, West Central Railway Chief Public Relations Officer says, "Report of a fire in the battery box of Vande Bharat Express 20171, that plies from Rani Kamlapati Station to Nizamuddin was received. Smoke was seen. The train was stopped at Kurwai Kethora… https://t.co/Z9FUYma5V6 pic.twitter.com/N8THI8CaHO
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
Vande Bharat Express Accident : మంటలు బ్యాటరీ బాక్స్‌కు మాత్రమే పరిమితం కావడం వల్ల ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని రైల్వే శాఖ తెలిపింది. బ్యాటరీ బాక్స్ ప్యాసింజర్లు ఉండే ప్రదేశానికి దూరంగా అండర్గేర్లో ఉంటుందని.. ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్ భద్రతా వ్యవస్థలు బ్యాటరీలను వేరుచేశాయని వెల్లడించింది. సమస్య తలెత్తిన బ్యాటరీలను తీసేశామని స్పష్టం చేసింది.
-
#WATCH | Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. Fire brigade reached the site and extinguished the fire. All passengers are safe. No injuries reported. The fire is limited to Battery Box Only.… pic.twitter.com/E2s9ED99VH
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. Fire brigade reached the site and extinguished the fire. All passengers are safe. No injuries reported. The fire is limited to Battery Box Only.… pic.twitter.com/E2s9ED99VH
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023#WATCH | Madhya Pradesh | A fire was reported in battery box of one of the coaches in a Vande Bharat Express at Kurwai Kethora station. Fire brigade reached the site and extinguished the fire. All passengers are safe. No injuries reported. The fire is limited to Battery Box Only.… pic.twitter.com/E2s9ED99VH
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 17, 2023
"ఉదయం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు నా సీటు కింద నుంచి మంటలు వస్తున్న శబ్దం వినిపించింది. ఈ విషయం నేను మిగతా ప్రయాణికులకు చెప్పాను. దీంతో అందరూ భయాందోళనకు గురై అటు ఇటు పరుగులు తీశారు. రైలు ఆగిన తర్వాత కోచ్ బ్యాటరీ బాక్స్‌లో మంటలు వ్యాపించడం చూశాం. ఆ తర్వాత మమ్మల్ని కిందకు దించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు" అని ఓ ప్రయాణికుడు తెలిపాడు. మంటలు చెలరేగిన రైలు.. మధ్యప్రదేశ్‌లోని తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్. భోపాల్- దిల్లీ మధ్య దీన్ని ఏప్రిల్ 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
3 గంటల పాటు నిలిచిన వందేభారత్..!
Vande Bharat Express Accident in Odisha : మే నెలలో భారీ వర్షాలకు చెట్టు కొమ్మలు విరిగి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై పడ్డాయి. దీంతో మూడు గంటల పాటు రైలు అక్కడే నిలిచిపోయింది. పూరీ నుంచి హౌరా వెళుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రమాదం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన నాలుగు రోజులకే ఇలా గమనార్హం. ఒడిశాలోని జైపుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.