ETV Bharat / bharat

'దిల్లీలోనే ఉంటాం.. నిరసనలు కొనసాగిస్తాం'

author img

By

Published : Nov 28, 2020, 5:20 PM IST

Updated : Nov 28, 2020, 5:27 PM IST

దేశ రాజధానిలోనే ఉండి.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని రైతులు తేల్చిచెప్పారు. కేంద్రం దిగొచ్చేంతవరకు వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. మరోవైపు దిల్లీ నిరసనల్లో తమ రైతులు పాల్గొనలేదని హరియాణా సీఎం మనోహర్​ లాల్​ ఖట్టర్​ వెల్లడించారు. ఆందోళనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు.

cm-manohar-lal-big-statement-on-farmers-agitation-against-farm-laws(khalistani angel)
'దిల్లీలోనే ఉంటాం.. నిరసనలు కొనసాగిస్తాం'

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్రం దిగొచ్చేంతవరకు దిల్లీలోనే ఉంటామని.. నిరసనలు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు భారతీయ కిసాన్​ యూనియన్​​ ప్రధాన కార్యదర్శి హరిందర్​ సింగ్​. దిల్లీ-హరియాణా సరిహద్దులోని సింఘూ వద్ద రైతులతో జరిగిన సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని రైతులు వెల్లడించారు. ఇంతకు ముందు కూడా చర్చలు జరిగాయని.. కానీ ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు. కొత్త చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

cm-manohar-lal-big-statement-on-farmers-agitation-against-farm-laws(khalistani angel)
కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు

రైతుల ఆందోళన

మరోవైపు రైతుల ఆందోళనలతో దిల్లీలో జనజీవన కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. నిరసనల వల్ల సింఘూ, టిక్రి సరిహద్దులను మూసివేశారు దిల్లీ పోలీసులు. దీంతో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

దేశరాజధానికి రైతుల తాకిడి గంటగంటకూ పెరుగుతోంది. తాజాగా.. 'దిల్లీ ఛలో'లో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లు, బస్సుల్లో దిల్లీకి బయలుదేరారు. శంభూ వద్ద పంజాబ్​-హరియాణా సరిహద్దును దాటారు.

'నిరసనల్లో మా రైతులు లేరు'

'దిల్లీ ఛలో'లో తమ రాష్ట్ర అన్నదాతలు పాల్గొనలేదని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ ఖట్టర్​ తేల్చిచెప్పారు. అదే సమయంలో.. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు వెనుక నుంచి నిరసనలను నడిపిస్తున్నాయని ఆరోపించారు.

"ఈ ఉద్యమాన్ని పంజాబ్​ రైతులు ప్రారంభించారు. కానీ దీనితో కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలకు సంబంధం ఉంది. హరియాణా రైతులు ఇందులో పాల్గొనలేదు. అందుకు నేను సంతోషంగా ఉన్నా. వారందరికీ నా అభినందనలు."

--- మనోహర్​ లాల్​ ఖట్టర్​, హరియాణా సీఎం.

రైతుల ఆందోళనలకు కారణం పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ అని మండిపడ్డారు ఖట్టర్​. అమరీందర్​ను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన అందుబాటులోకి రావడం లేదని పేర్కొన్నారు.

రైతుల నిరసనలతో ఖలిస్థాన్​ వేర్పాటువాదులకు సంబంధం ఉన్నట్టు వస్తున్న వార్తలకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు ఖట్టర్​. ఆందోళనల్లో అవాంఛనీయ అంశాలున్నట్టు తమకు సమాచారం ఉందని.. త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు.

ఇదీ చూడండి:- ఆ 8 రాష్ట్రాల్లోనే మహమ్మారి వ్యాప్తి అధికం

Last Updated : Nov 28, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.