బాంబు దాడిలో గాయపడ్డ బంగాల్ మంత్రి జాకిర్ హుస్సేన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
బుధవారం రాత్రి.. బంగాల్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై బాంబు దాడి జరిగింది. ముర్షిదాబాద్ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కోల్‌కతా వెళ్లేందుకు నిమ్టిటా స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయనపై దుండగులు బాంబులు విసిరారు. అనంతరం ఆయన్ని ముర్షిదాబాద్ వైద్య కళాశాలకు చికిత్స కోసం తరలించారు.
హుస్సేన్ పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు గురువారం ఉదయం వెల్లడించాయి. ఆయన చేయ్యి, కాలుకు గాయాలైనట్టు వెల్లడించారు.
సీఐడీ విచారణ..
జాకీర్ హుస్సేన్‌పై బాంబు దాడి ఘటనకు సంబంధించిన కేసుపై సీఐడీ విచారణ చేపట్టనుంది. నిందితులను పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించింది.
ఇదీ చదవండి : ఎన్నికల వేళ బంగాల్లో అమిత్ షా పర్యటన