CM Jagan Cut Festive Kanuka : సీఎంగా జగన్ పీఠమెక్కినప్పటి నుంచి నిత్యావసరాల పంపిణీకి కోతలు పెట్టడం మొదలైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎవరైనా గత ప్రభుత్వం కంటే మరింత మెరుగ్గా సంక్షేమ పథకాలు అమలు చేయాలని తపిస్తారు. జగన్ మాత్రం పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు, తెలుగుదేశం మీది కోపాన్ని పేదల మీద చూపిస్తున్నారు. సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, రంజాన్ తోఫాలను ఎత్తేశారు.
CM Jagan Cut Essentials Distribution : టీడీపీ ప్రభుత్వ హయాంలో కానుకల కోసం మొత్తంగా 18వందల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. తనను తాను పేదల పక్షపాతిగా చెప్పుకొనే జగన్ బీదల కోసం రూపాయి కూడా ఇవ్వడం లేదు. పేద కుటుంబాల్లో పండుగ సంతోషం నింపేందుకు ఏడాదికి 400 కోట్లు కూడా ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు. ఇతర నిత్యావసరాల పంపిణీని క్రమంగా కుదించుకుంటూ వచ్చారు. పౌరసరఫరాల సంస్థ పేరుతో ఏటా వేల కోట్ల రూపాయల్ని అప్పుగా తెచ్చుకుంటున్న సర్కారు బీదల సంక్షేమానికి అందులోంచి కొంత మొత్తమైనా ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ఆఖరుకు మొత్తంగా ప్రజాపంపిణీ వ్యవస్థనే నీరుగార్చిపేదలకు కన్నీటినే మిగుల్చుతున్నారు.
ముస్లింలకు ఆ పథకాలు టీడీపీ అమలు చేస్తే.. వైసీపీ రద్దు చేసింది: చంద్రబాబు
Festive Kanuka in Tdp Government : గత ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా పండుగ కానుకలు పంపిణీ చేశారు. పేద కుటుంబాల్లోనూ పండగ సందడి నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 130 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు కమీషన్ కింద ఒక్కో కానుకకు10 రూపాయల చొప్పున చెల్లించారు. గతంలో సంక్రాంతి కానుక కింద అర కిలో కందిపప్పు, అరలీటరు పామోలిన్, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, కిలో గోధుమపిండి, 100మిల్లీ లీటర్ల నెయ్యి చొప్పున ఆరు రకాల సరకుల్ని పంపిణీ చేశారు. క్రిస్మస్ సమయంలో ఇవే కానుకల్ని క్రైస్తవులకు అందజేసేవారు. దీనికి ఏడాదికి సగటున 325 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. రంజాన్ తోఫా (Ramzan Tohfa) ద్వారా సుమారు 11 లక్షల 30 వేల ముస్లిం కుటుంబాలకు లబ్ధి కలిగింది. వారికి 2 కిలోల పంచదార, 5 కిలోల గోధుమపిండి, కిలో సేమియా, 100 మిల్లీ లీటర్ల నెయ్యి చొప్పున ఉచితంగా అందించారు. దీనికి 136 కోట్ల 71 లక్షల రూపాయలు ఖర్చు చేశారు.
Ration Shops Situations in AP : జగన్ అధికారంలోకి రావడంతోనే కానుకల్ని కరిగించేశారు. పౌరసరఫరాల సంస్థ సేవల కోసం అంటూ సుమారు 30 వేల కోట్ల రూపాయలకు పైగా అప్పు తెచ్చినా పేదల గోడు పట్టించుకోకుండా వదిలేశారు. ఎన్నికల ముందు మాత్రం ఆహా ఓహో అనేలా హామీల సునామీ సృష్టించారు. గెలిచాక మాత్రం పండుగ కానుకలెందుకు శుద్ధ దండగ అన్నట్లు వ్యవహరిస్తూ అన్నింటికీ సున్నా చుట్టేశారు. 2019 జూన్ తర్వాత నుంచైతే కానుకల పంపిణీని పూర్తిగా ఆపేశారు.
TDP Implement Festive Gifts : గతంలో ఒక్కో కార్డుపై కిలో 40 రూపాయల చొప్పున 2 కిలోల కందిపప్పును ఇచ్చేవారు. ఇప్పుడు పండుగ సమయంలో కనీసం కిలో కందిపప్పు ఇవ్వడం లేదు. ఇప్పుడు దాని ధర కిలో 67రూపాయలకు పెంచేశారు. ప్రతి నెలా 14 వేల టన్నుల చొప్పున అవసరం కాగా 6 వేల టన్నులకు మించి అందుబాటులో ఉంచడం లేదు. గతేడాది జులై నుంచి వాటిని పూర్తిగా నిలిపేశారు. ఈ జనవరిలో ఇస్తామంటున్నా 50శాతం కార్డుదారులకు మాత్రమే అందుబాటులో ఉంచారు. అదీ కొన్ని జిల్లాల్లో సరిగా అందడం లేదు. మొత్తంగా నిత్యావసరాల పంపిణీనే అపహాస్యం చేశారు.
Ration Vehicles in AP: ఇంటింటికీ రేషన్ ఇస్తున్నామంటూ గొప్పగా మాటలు.. క్షేత్రస్థాయిలో మాత్రం..