ETV Bharat / bharat

అసోంలో ఉద్రిక్తత.. పోలీసులు- పౌరుల మధ్య ఘర్షణ

author img

By

Published : Jul 24, 2021, 6:56 PM IST

అసోంలో పోలీసులు, పౌరులకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు సహా ఇద్దరు పౌరులు గాయపడ్డారు.

Civilians clash with cops
అమిత్​ షా

అసోంలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా పర్యటనకు ఒక రోజు ముందు.. ఆ రాష్ట్ర పోలీసులు, పౌరుల మధ్య శనివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. టిన్​సుకియా జిల్లాలోని భాగ్​జన్​ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులకు కూడా గాయాలయ్యాయి.

Civilians clash with cops
దగ్ధమైన అగ్నిమాపక వాహనం

పరిహారం చెల్లిస్తేనే..

భాగ్​జన్​లోని ఆయిల్​ ఇండియాకు చెందిన ఓ చమురు బావిని సీల్​ చేయడానికి వాడిన పరికరాలను తొలగించేందుకు వచ్చిన సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. గతేడాది ఆ బావిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో ఈ ప్రాంతం తీవ్ర వినాశనానికి గురైంది. దీంతో ప్రభావిత కుటుంబాలకు తొలుత పరిహారం చెల్లించాలని స్థానికులు డిమాండ్ చేశారు. రోడ్డును దిగ్బంధించారు.

Civilians clash with cops
టియర్ గ్యాస్ ప్రయోగం

పరిస్థితిని చక్కబెట్టేందుకు భద్రతా దళాలు ప్రయత్నించే క్రమంలో ఆందోళనకారులు వారిపై రాళ్లు విసిరారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి హింసాత్మకంగా మారింది. క్రమంగా నిరసనకారుల సంఖ్య పెరగడం వల్ల బలగాలు లాఠీఛార్జ్ చేశారు. గాల్లోకి కాల్పులు జరిపి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు, మరో ఇద్దరు పౌరులకు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.

Civilians clash with cops
ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న అధికారులు

ఇదీ చూడండి: అసోం చమురు బావిలో మరో భారీ పేలుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.