CID Notices to TDP Central Office NTR Bhavan: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. పార్టీ ఖాతాల వివరాలు తమకు అందచేయాలంటూ, కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు సీఐడీ కానిస్టేబుల్ నోటీసు ఇచ్చి వెళ్లారు. ఈ నెల 18లోగా వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. స్కిల్ కేసుకి సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు కావాలని కోరారు. సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ తెలుగుదేశం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది.
అయితే ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయగా.. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నారు. అదే విధంగా చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు పెడుతోంది. ఎటువంటి ఆధారాలు లేకున్నా.. దొంగ కేసులు పెడుతూ చంద్రబాబును అరెస్టు చేయాలని చూస్తున్నారని టీడీపీ మండిపడుతోంది.
స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
Skill Development Case in Supreme Court: ఇకపోతే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. దీపావళి తర్వాత స్కిల్ కేసుపై తీర్పు వెలువరించనున్నట్లు సుప్రీం తెలపడంతో.. తీర్పు మరో కొద్ది రోజులలో రానుంది. ఈ తీర్పు 17ఏతో ముడిపడి ఉండటంతో.. ఏ విధంగా ఉండబోతుందో అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 10వ తేదీన ఏపీ సీఐడీ.. చంద్రబాబును అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసింది. తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో.. చంద్రబాబు 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే జైలులో చంద్రబాబు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో.. హైకోర్టు ఆయనకు కొద్ది రోజుల క్రితం మధ్యంతర బెయిల్ ఇచ్చింది.
అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు
Skill Development Case in High Court: అదే విధంగా స్కిల్ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి బెయిల్కి సంబంధించిన బెయిల పిటిషన్ సైతం హైకోర్టులో పెండింగ్లో ఉంది. దీనిపై విచారణ ఈ నెల 15వ తేదీన జరగనుంది. తొలుత 10వ తేదీన విచారణ జరగగా.. ఆరోజు అడ్వకేట్ జనరల్ హాజరు కాలేదు. దీంతో విచారణ 15కి వాయిదా వేస్తూ.. మరోసారి గడువు పొడిగించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది.
అయితే ఇప్పటి వరకూ ఈ కేసులో ఎటువంటి ఆధారాలను ఏపీ సీఐడీ చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు టీడీపీ ఆఫీసుకు నోటీసులు ఇవ్వడంపై.. తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన విరాళాల గురించి.. టీడీపీ వివరణ సైతం ఇచ్చింది. అయినా సీఐడీ నోటీసులు ఇచ్చింది.
చంద్రబాబు మధ్యంతర బెయిల్ - అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పు