ETV Bharat / bharat

'పవర్​స్టార్​ పునీత్​కు పద్మశ్రీ ఇవ్వాల్సిందే​!' - పునీత్ రాజ్​కుమార్ పద్మశ్రీ

గుండెపోటుతో ఇటీవలే మరణించిన కన్నడ పవర్​ స్టార్ పునీత్ రాజ్​కుమార్​కు(puneeth rajkumar news) పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనే డిమాండ్​ రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక భాజపా మంత్రులు కూడా పునీత్​ పేరును కేంద్రానికి సిఫార్సు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు(karnataka news). ఆయన చేసిన సేవలకు గానూ మరణానంతరం అవార్డు ప్రకటించాలంటున్నారు.

Chorus demanding 'Padma Shri' award for Puneeth Rajkumar grows
పవర్​స్టార్​ పునీత్​కు పద్మశ్రీ ఇవ్వాలని పెరుగుతున్న డిమాండ్​
author img

By

Published : Nov 7, 2021, 5:27 PM IST

కన్నడ పవరస్టార్ పునీత్ రాజ్​కుమార్​కు మరణానంతరం(puneeth rajkumar news) పద్మశ్రీ అవార్డు ఇవ్వాలనే డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఆయన పేరును అవార్డు కోసం కేంద్రానికి సిఫారసు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రికి సూచించారు భాజపా మంత్రులు(karnataka news).

పునీత్​(puneeth rajkumar news kannada) సాధించిన విజయాలు, చేసిన సేవలకు ఆయన బతికున్నప్పుడే పద్శశ్రీతో సత్కరించాల్సిందని కన్నడ నటుడు, వ్యవసాయ మంత్రి బీసీ పాటిల్​ అన్నారు. దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేరని, మరణానంతరం అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

'ఒక అభిమానిగా ఇతరుల డిమాండ్​తో నేను ఏకీభవిస్తున్నా. పునీత్​ పేరును కేంద్రానికి సిఫారసు చేయాలని ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నా. ఒక నటుడిగా, సమాజ సేవకుడిగా ఆయన ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హులు' అని పాటిల్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదన కేబినెట్​ ముందుకు వస్తే ఏకగ్రీవంగా ఆమోదిస్తామని స్పష్టం చేశారు.

కర్ణాటక పర్యటక మంత్రి ఆనంద్ సింగ్​ కూడా ఇదే డిమాండ్ చేశారు. పునీత్​కు ఎప్పుడూ సేవ చేయాలనే దృక్పథం ఉండేదని, పల్స్ పోలీయో వంటి ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. కన్నడ నటుడు ప్రేమ్ కూడా పునీత్​కు వీలైనంత త్వరగా పద్మశ్రీ ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్​ కూడా..

పునీత్​కు మరణానంతరం పద్మశ్రీ ప్రకటించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు సిద్ధారామయ్య కూడా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై(karnataka cm news) ఇటీవలే స్పందించారు. ఎప్పుడు, ఏ రంగానికి చెందిన వారి పేర్లను పద్మ అవార్డులకు సిఫారసు చేయాలో నిబంధనలు ఉన్నాయన్నారు. ఒక విధంగా పునీత్​ రాజ్​కుమార్​ పేరు ఏకగ్రీవంగా సిఫారసు అవుతుందని, ప్రభుత్వం అన్ని విషయాలు పరిగణించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కర్ణాటక ప్రజలు, ప్రభుత్వానికి పునీత్​ రాజ్​కుమార్​ పట్ల ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు.

భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. వివిధ రంగాల్లో పౌరులు చేసిన విశేష సేవలకు గానూ ఈ పురస్కారంతో గౌరవిస్తుంది.

పునీత్ రాజ్​కుమార్​.. కన్నడ దిగ్గజ నటుడు రాజ్​కుమార్​ కుమారుడు. ఐదుగురు సంతానంలో ఆయనే చిన్నవాడు. అక్టోబర్ 29న వ్యాయామం చేస్తూ గుండెపోటు రాగా ఆస్పత్రిలో చేరిన పునీత్​.. ఆరోజే మరణించారు(puneeth rajkumar news). 6 నెలల వయసులోనే వెండితెర తెరంగ్రేట్రం చేసిన ఆయన.. 2002లో అప్పు సినిమా ద్వారా హీరోగా పరిచమయ్యారు. పలు సూపర్​హిట్ సినిమాల్లో నటించి కన్నడ పవర్​స్టార్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గొప్ప దాతృత్వం చాటుకున్నారు.

ఇదీ చదవండి: 'ఆర్యన్​​ కిడ్నాప్​కు వాంఖడే స్కెచ్- షారుక్​కు బెదిరింపులు!​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.