ETV Bharat / bharat

భారత్​లోకి చొరబడ్డ చైనా దేశస్థుడు అరెస్ట్​ - బంగాల్​లో చైనా వ్యక్తి అరెస్ట్​

బంగ్లాదేశ్​ సరిహద్దు మీదుగా బంగాల్​లోకి ప్రవేశించిన చైనా దేశస్థుడిని సరిహద్దు భద్రత దళాలు అరెస్టు చేశాయి. అతని నుంచి ల్యాప్​టాప్, బంగ్లాదేశ్​ వీసా ఉన్న చైనా పాస్​పోర్ట్, మూడు సిమ్​కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Chinese national held by BSF, BSF arrests chinese national
చైనా వ్యక్తి అరెస్ట్​.. ల్యాప్​టాప్​ స్వాధీనం
author img

By

Published : Jun 10, 2021, 5:47 PM IST

బంగ్లాదేశ్​ సరిహద్దుల మీదుగా భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ 35 ఏళ్ల చైనా దేశస్థుడిని సరిహద్దు భద్రత దళాలు గురువారం అరెస్టు చేశాయి. ఈ ఘటన బంగాల్​లోని మాల్దా జిల్లాలో జరిగింది.

చైనాకు చెందిన జూవైన్​ హన్​ను.. ఉదయం సుమారు 7 గంటలకు సరిహద్దు దాటుతుండగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. సరిహద్దు దాటి రావడంపై అతను ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడం వల్ల అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నామని చెప్పారు. అతని నుంచి ల్యాప్​టాప్, బంగ్లాదేశ్​ వీసా ఉన్న చైనా పాస్​పోర్ట్, మూడు సిమ్​కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

బంగ్లాదేశీ అరెస్ట్​..

అంతకుముందు సరిహద్దు దళాలు.. భారత్​లో నివసిస్తూ మానవ అక్రమ రవాణా చేస్తున్న బంగ్లాదేశీని అరెస్టు చేశాయి. అతడిని ఘోజదాంగ చెక్​పోస్ట్​కు తరలించి దర్యాప్తు చేపట్టాయి. నిందితుడి నుంచి 2 మొబైల్​ ఫోన్స్​, భారతీయ సిమ్​కార్డులు, ఐదు బంగ్లాదేశీ సిమ్​కార్డులు సహా వివిధ నకిలీ ఆధార్​ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు హస్సన్​ ఘోజీ (28) బంగ్లాదేశ్​లోని సాత్ఖిరా జిల్లాకు చెందిన వాడని దర్యాప్తులో తెలిసింది. అక్రమంగా భారత్​లోకి చొరబడి గత 20 ఏళ్లగా భారత్​లోనే నివసిస్తున్నట్లు.. ఇటీవల 25 ఏళ్ల భారతీయురాలిని కూడా వివాహం చేసుకున్నట్లు నిందితుడు వెల్లడించాడు. ​ ​​

ఇదీ చదవండి : వింత ప్రేమకథ- పదేళ్లుగా ఒకే గదిలో యువతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.