తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో చైనా చేపట్టిన సైనిక నిర్మాణాలు (Chinese Military News), పెద్దఎత్తున బలగాల కొనసాగింపు.. ఆందోళనకరమని ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం నరవణే (MM Naravane News) తెలిపారు. అయితే చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు.
ఈ శీతాకాలంలోనూ డ్రాగన్ తన బలగాలను కొనసాగిస్తే.. నియంత్రణరేఖ (ఎల్ఓసీ) వద్ద ఉన్నటువంటి పరిస్థితులు (LOC News) నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ఎల్ఏసీ వెంట చైనా తన బలగాలను అలాగే కొనసాగిస్తే.. భారత్ కూడా అదేపంథాను అనుసరిస్తుందన్నారు.
దాదాపు 17 నెలల నుంచి వాస్తవాధీన రేఖ వెంట ఉన్న తూర్పు లద్ధాఖ్‌లోని పలు ప్రాంతాల్లో భారత్-చైనా సైన్యాల మధ్య ప్రతిష్టంభన (Eastern Ladakh Standoff) నెలకొంది. అయితే పలు దశల్లో జరిగిన చర్చల తర్వాత.. కొన్ని ప్రాంతాల నుంచి ఇరు దేశాలు తమ సైన్యాలను ఉపసంహరించుకున్నాయి.
చొరబాట్లు జరగవచ్చు..
అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఆ దేశ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌లోకి చొరబడే అవకాశం లేకపోలేదని నరవణే (MM Naravane News) అన్నారు. రెండు దశాబ్దాల క్రితం తాలిబన్ల పాలనలో కూడా అలాంటి ఘటనలు జరిగాయని తెలిపారు. అయితే చొరబాటుదారులను ఎదుర్కొని, సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత సాయుధ దళాలు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
ఇదీ చూడండి: 'తైవాన్ను చైనాలో కలిపేసుకుంటాం- అడ్డొస్తే ఊరుకోం!'