ETV Bharat / bharat

సుక్మా అడవుల్లో ఎదురుకాల్పులు​.. నక్సల్​ కమాండర్​ హతం - ఎన్​కౌంటర్​ న్యూస్​

ఛత్తీస్​గ​ఢ్​ సుక్మా జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ ఎన్​కౌంటర్(encounter in chhattisgarh)​ జరిగింది. పోలీసుల కాల్పుల్లో కీలక నక్సల్​ కమాండర్​ హతమైనట్లు అధికారులు తెలిపారు. అతనిపై రూ. 5లక్షల రివార్డ్ ఉందని చెప్పారు.

encounter in Sukma
సుక్మా అడవుల్లో ఎదురుకాల్పులు
author img

By

Published : Nov 26, 2021, 10:46 PM IST

ఛత్తీస్​గఢ్​లోని సుక్మా జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్​కౌంటర్​లో(encounter in chhattisgarh) కీలక నక్సల్​ కమాండర్​ను హతమార్చాయి పోలీసు బలగాలు. గతంలో.. భద్రతా దళాలపై జరిగిన సుమారు 9 భయంకర దాడుల్లో(IED attacks) కమాండర్ బస్తా భీమా​ భాగమైనట్లు అధికారులు తెలిపారు. అతనిపై రూ.5 లక్షల రివార్డ్​ సైతం ఉన్నట్లు చెప్పారు.

"జిల్లా రిజర్వ్​ గార్డ్స్​, సీఆర్​పీఎఫ్​కు చెందిన కోబ్రా దళాలు నక్సలైట్ల ఏరివేతలో భాగంగా సుక్మా జిల్లా తాడ్​మెట్లా గ్రామంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల అనంతరం బస్తా భీమా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం."

- సునీల్​ శర్మ, జిల్లా ఎస్పీ.

2020, మార్చిలో మిన్పా అటాక్​లో 17 మంది భద్రతా సిబ్బందిని పొట్టన పెట్టుకున్న దాడిలో భీమా పాల్గొన్నాడని పోలీసులు తెలిపారు. అలాగే.. అదే ఏడాది నవంబర్​లో చింతల్నార్​ ప్రాంతంలో జరిగిన ఐఈడీ దాడిలో కోబ్రా అసిస్టెంట్​ కమాండర్​ ప్రాణాలు కోల్పోయాడు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలోనూ భీమా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: కష్టకాలంలో కూలీ సాహసం- కాలి నడకన హైదరాబాద్​ టూ అసోం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.