ETV Bharat / bharat

సచిన్, ధోనీ, అభిషేక్​ బచ్చన్​ పేర్లతో ఫ్రాడ్.. బ్యాంకులకు రూ.90లక్షలు టోకరా - నకిలీ సోనియా గాంధీ పీఏ

సచిన్​ తెందూల్కర్​, మహేంద్ర సింగ్ ధోనీ, అభిషేక్​ బచ్చన్​, ఐశ్వర్యరాయ్​, సుస్మితా సేన్​తో సహా 95 మందికి పైగా ప్రముఖుల వివరాలతో ఓ ముఠా వివిధ బ్యాంకుల్లో రూ.90 లక్షలు మేర మోసం చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు.

Fake ID cards of celebrities
Fake ID cards of celebrities
author img

By

Published : Mar 3, 2023, 5:05 PM IST

దేశ రాజధానిలో ఘరానా మోసం వెలుగుచూసింది. ఓ సైబర్​ నేరగాళ్ల ముఠా కిక్రెట్, సినీ రంగానికి చెందిన ప్రముఖుల పేర్లతో బ్యాంకులను రూ.90 లక్షలకు పైగా మోసం చేసింది. ఈ దొంగలు ముఠా ఈ నేరాలు పాల్పడేందుకు.. క్రికెట్​ దిగ్గజాలు సచిన్ తెందూల్కర్,​ ఎమ్​ ఎస్​ ధోనీ.. సినీ ప్రముఖులు హృతిక్​ రోషన్, అభిషేక్ బచ్చన్​​తో పాటుగా మరికొంత మంది సెలబ్రిటీల వివరాలను ఉపయోగించడం విశేషం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ సైబర్​ నేరగాళ్ల ముఠా గతకొంత కాలంగా.. దిల్లీలో హైటెక్​ మోసాలకు పాల్పడుతోంది. ఈ ముఠా దేశంలోని క్రికెట్​, సినీ రంగాలకు చెందిన దాదాపు 90 మంది ప్రముఖుల వివరాలతో బ్యాంకులకు.. రూ.90 లక్షలకు పైగా మోసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. దర్యాప్తు చేపట్టిన షాహదారా జిల్లా పోలీసులు శుక్రవారం ఈ ముఠాకు చెందిన సునీల్ కుమార్, పునీత్, ఆసిఫ్, విశ్వ భాస్కర్ శర్మతో పాటుగా మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు. నిందితుల్ని విచారించిన పోలీసులకు వారు విస్తుపోయే నిజాలను వెల్లడించారు. వీరు సెలబ్రిటీల పేరుతో నకిలీ పాన్​కార్డ్​లను ఉపయోగించి వివిధ బ్యాంకులకు రూ.90 లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్స్​, 1 ల్యాప్‌టాప్, 3 సీపీయూలు, 34 నకిలీ పాన్ కార్డులు, 25 నకిలీ ఆధార్ కార్డులు, 40 డెబిట్/క్రెడిట్ కార్డులు సహా పలు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ముఠా సభ్యులు.. ప్రముఖులకు చెందిన జీఎస్టీ వివరాలను సంపాదించి దాని ద్వారా వారి పాన్ నంబర్​ను తెలుకునేవారు. దీంతో వీరు సెలబ్రిటీల పేర్లతో నకిలీ పాన్​కార్డ్, ఆధార్​ కార్డును తయారు చేసుకునేవారు. ఆ తర్వాత వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్​ కార్డులను పొంది వాటితో లక్షలు విలువ చేసే వస్తువులను కొనుగోలు చేసేవారు. ఈ ముఠా వినియోగించిన నకిలీ పాన్​కార్టుల్లో.. ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్​ తెందూల్కర్​, టీమిండియా మాజీ కెప్టెన్​ ఎమ్​ఎస్​ ధోని, ప్రముఖ బాలీవుడ్​ నటీనటులు హృతిక్​ రోషన్​, అభిషేక్ బచ్చన్​, సోనమ్​ కపూర్​, సైఫ్​ అలీఖాన్​, అలియా భట్​, శిల్పాశెట్టితో పాటుగా మరికొందరి పేర్లు ఉన్నాయి. ఈ విషయాన్ని షాహదారా డీసీపీ రోహిత్​ మీనా వెల్లడించారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Fake ID cards of celebrities
అభిషేక్​ బచ్చన్​ పేరుతో నకిలీ పాన్​కార్డ్​ తయారు చేసిన దొంగల ముఠా

కేంద్ర మంత్రి పేరుతో దందాలు!
కేంద్ర మంత్రిని, సోనియా గాంధీ పీఏని అని చెప్పుకునే తిరిగే ఓ మోసగాడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటుగా అతని ముగ్గురు సహచరులను కూడా దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్​ తివారీ అనే వ్యక్తి తాను కేంద్రమంత్రినని చెప్పుకుంటా ఓ వ్యక్తిని తన వద్దకు పిలిచాడు. దీంతో సదరు వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు.. సంజయ్​తో పాటుగా అతని అనుచరులను అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్​ ఏజెన్సీతో పాటుగా నిందితుల్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సంజయ్​కు గతంలో కూడా ఇదే తరహా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2017లో సంజయ్​ కాంగ్రెస్​ నాయకురాలు సోనియా గాంధీకి పర్సనల్​ అసిస్టెంట్​(పీఏ)గా చెప్పుకుని తిరిగేవాడు. గతంలో ఈ విషయంలో సంజయ్​ అరెస్ట్ అయినట్లు కూడా పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.