ETV Bharat / bharat

Chandrababu Shifted to Central Jail: ఆంక్షల మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు.. తండ్రిని చూసి ఉద్వేగానికి లోనైన లోకేశ్ - Chandrababu arrested

Chandrababu Shifted to Rajamahendravaram Central Jail: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరలింపు పూర్తి ఆంక్షల మధ్య సాగింది. జైలు పరిసర ప్రాంతంలో పికెటింగు ఏర్పాటు చేసిన పోలీసులు ఎవ్వరినీ అక్కడకు అనుమతించలేదు. కారాగారం వద్ద చంద్రబాబును కలుసుకునేందుకు ఆయన తనయుడు లోకేశ్‌ను ఆంక్షల మధ్యే అనుమతించారు.

chandrababu_shifted_to_central_jail
chandrababu_shifted_to_central_jail
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 8:12 AM IST

Chandrababu Shifted to Central Jail: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చంద్రబాబు తరలింపు.. తండ్రిని చూసి ఉద్వేగానికి లోనైన లోకేశ్

Chandrababu Shifted to Rajamahendravaram Central Jail: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో (Skill Development Case) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడ అనిశా కోర్టు రిమాండ్ (Remand) విధించడంతో నాటకీయ పరిణామాల మధ్య రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. విజయవాడలో తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరిన కాన్వాయ్ రెండున్నర గంటల్లో రాజమహేంద్రవరం చేరుతుందని అంతా భావించారు. కానీ పోలీస్ ఆంక్షలు మధ్య వాహన శ్రేణి నాలుగున్నర గంటలు ఆలస్యంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు (Rajamahendravaram Central Jail) చేరుకుంది. చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే దారి పొడవునా సాధారణ ప్రయాణికులు వాహనాలను ఆపేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విజయవాడ నుంచి గన్నవరం మధ్యలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. టోల్‌గేట్ల వద్ద వాహనాలు ఆపేయడంతో ఇబ్బందులు పడ్డారు.

Nara Lokesh Emotional Letter to Telugu People ప్రజలారా అధైర్య పడొద్దు.. మీకు నేనున్నా: లోకేశ్ బహిరంగ లేఖ

Lokesh Gets Emotional Seeing his Father in Jail: జైలు వద్ద చంద్రబాబు వాహనాన్ని మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేశ్, మాజీ మంత్రి జవహర్ తూర్పు గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ చంద్రబాబు (Chandrababu) కాన్వాయ్​తో పాటు వచ్చారు. వారందరినీ పోలీసులు బయట నిలిపి వేశారు. లోకేశ్ (Lokesh) కొంతసేపు నిరీక్షణ అనంతరం పోలీసులు ఆయన్ను లోపలకి అనుమతించారు.

చంద్రబాబు కారాగారంలోకి వెళ్లే సమయంలో లోకేశ్‌ను ప్రధాన ద్వారం వరకు అనుమతించారు. ఈ సమయంలో తండ్రిని చూసి లోకేశ్ ఉద్వేగానికి లోనయ్యారు. లోకేశ్‌ను ఓదార్చిన చంద్రబాబు అంతా ధైర్యంగా ఉండాలని.. ఈ అక్రమ కేసులు తననేమీ చేయలేవని ధైర్యం చెప్పారు. అమ్మ జాగ్రత్త అని లోకేశ్‌కు చెప్పి కారాగారంలోకి వెళ్లారు. పోలీసులు చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు..

Chandrababu Naidu Shifting To Rajahmundry Central Jail కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్‌.. రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబు తరలింపు

Implementation of Police Act- 30 in East Godavari District: చంద్రబాబు రిమాండ్ (Chandrababu remanded) నేపథ్యంలో పోలీస్ చట్టం -30ని తూర్పు గోదావరి జిల్లాలో అమలులోకి తెచ్చారు. జిల్లా నేతలను గృహ నిర్బంధం చేశారు. జైలు వద్ద పోలీసులు పూర్తి ఆంక్షలు విధించారు. కారాగారం పరిసర ప్రాంతాలు పికెటింగులు, ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులను మోహరించారు. జైలు పరిసర ప్రాంతాల్లోకి ఏ వాహనాలను అనుమతించలేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా పోలీసులు తెలుగుదేశం నేతల ఇళ్ల వద్ద మోహరించి గృహనిర్భందాలు, అరెస్టులు చేయడంతో ఎవరు జైలు వద్దకు రాలేకపోయారు. చంద్రబాబు కాన్వాయ్ ప్రయాణించే దారి పొడవునా సాధారణ ప్రయాణికులు వాహనాలను ఆపేయడంతో వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Dhulipalla Narendra on Chandrababu తెలుగుజాతి కోసం పాటుపడిన వ్యక్తి చంద్రబాబు.. రేపటి రోజు ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.