ETV Bharat / bharat

"చంద్రబాబు ఎక్కడా బెయిల్​ షరతులను ఉల్లంఘించలేదు" - చంద్రబాబుపై సీఐడీ కేసులు

Chandrababu not Violated High Court Conditions: స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన చంద్రబాబును.. వైసీపీ ప్రభుత్వం ఇంకా జైలులోనే ఉండాల్సింది అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకు తగినట్లుగానే దర్యాప్తు సంస్థ సీఐడీని ప్రభుత్వం నడిపిస్తోందని.. దర్యాప్తు సంస్థ అధికారులను ప్రభుత్వం గుప్పిట్లో ఉంచుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగానే మధ్యంతర బెయిల్​పై విడుదలైన చంద్రబాబును షరతుల పేరుతో రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు అంటున్నారు.

chandrababu_not_violated_high_court_conditions

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2023, 7:11 AM IST

Chandrababu not Violated High Court Conditions: "చంద్రబాబు ఎక్కడా బెయిల్​ షరతులను ఉల్లంఘించలేదు"

Chandrababu not Violated High Court Conditions: స్కిల్​ కేసులో మధ్యంతర బెయిలుపై జైలు నుంచి విడుదలైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోర్టు షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని హైకోర్టు తేల్చిచెప్పింది. చంద్రబాబు ఇంటి వద్ద కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీల్ని అనుమతించాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రజలు పలకరిస్తే స్పందించడం సహజమన్న న్యాయమూర్తి.. చంద్రబాబు వద్దకు వెళ్లొద్దంటూ ప్రజలను ఆదేశించబోమని స్పష్టం చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మధ్యంతర బెయిల్​పై విడుదలైన చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలని సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు మీడియా సమావేశాలు నిర్వహించకుండా, రాజకీయ ర్యాలీలలో పాల్గొనకుండా అడ్డుకోవాలని.. ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు ఆయన రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించి హైకోర్టుకు నివేదికలు ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరింది.

ఏఐజీ ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జి - కుడి కంటికి ఆపరేషన్ అవసరమన్న నేత్ర వైద్యులు

పలకరించేందుకు వచ్చిన వారిని ఆపలేరు కదా: సీఐడీ అనుబంధ పిటిషన్​ను విచారణ జరిపిన న్యాయమూర్తి కోర్టు ముందున్న ఆధారాలను పరిశీలిస్తే జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబును పలకరించేందుకు అనేక మంది ప్రజలు వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. తనను చూసేందుకు వచ్చేవారిని చంద్రబాబు నిరోధించలేరనే విషయాన్ని గుర్తించాలని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారని చెప్పడానికి సాక్ష్యాధారాలు లేవన్నారు.

అధికార పార్టీ ప్రోద్బలంతో సీఐడీ కేసు: అనారోగ్య కారణాల దృష్ట్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిలు ఇవ్వడాన్ని ‘కస్టోడియల్‌ బెయిల్‌’తో సమానంగా చూడలేమన్నారు. చంద్రబాబు ఇంటివద్ద కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను అనుమతించడమంటే గోప్యత హక్కును హరించడమేనన్న చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలో బలం ఉందన్నారు. చంద్రబాబుపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికై అధికార వైసీపీ ప్రభుత్వం.. ప్రోద్బలంతోనే సీఐడీ కేసు పెట్టిందని ఆయన వాదించారు. రాబోయే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారని గుర్తు చేశారు.

చంద్రబాబు మధ్యంతర బెయిల్‌ - అదనపు షరతుల అంశంపై హైకోర్టు తీర్పు

రాజకీయ కార్యకాలపాలకు దర్యాప్తునకు పొంతనేంటి: చంద్రబాబు రాజకీయ కార్యక్రమాలకు సీఐడీకి సంబంధమేంటని.. ఆ కార్యకలాపాలపై షరతుల విధింపు దర్యాప్తు కోసం ఏవిధంగా ఉపయోగపడుతుందో సీఐడీ స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో ‘సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బెయిలు మంజూరు సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులను చంద్రబాబు ఉల్లంఘించారని, కారాగారం బయట మాట్లాడారని, ర్యాలీలో పాల్గొన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు.

అయితే పెన్‌డ్రైవ్‌ పరిశీలిస్తే చంద్రబాబు రాజకీయ ర్యాలీలో పాల్గొన్నట్లు, బహిరంగ సమావేశం పెట్టినట్లు కనిపించలేదని న్యాయమూర్తి అన్నారు. మధ్యంతర బెయిలు దరఖాస్తులో ర్యాలీలు, బహిరంగ సమావేశాలకు అనుమతివ్వాలని చంద్రబాబు కోరలేదు. ఒకవేళ కోరి ఉంటే ఆయా పరిస్థితుల్లో మధ్యంతర బెయిలు ఇవ్వాలా లేదా అనే ప్రశ్న న్యాయస్థానం ముందు తలెత్తేది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

పూర్తిగా నిషేధం విధించినట్లు కాదు: రాజకీయ ర్యాలీలు, బహిరంగ సమావేశాల్లో పాల్గొనవద్దని చంద్రబాబును ఆదేశిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలా అని చంద్రబాబుపై పూర్తిగా నిషేధం విధించినట్లు కాదని.. ఆయన ప్రాథమిక హక్కులను హరించినట్లు భావించడానికి వీల్లేదని అన్నారు. దర్యాప్తు సంస్థ హక్కులను, చంద్రబాబు హక్కులను దృష్టిలో పెట్టుకొని సమతౌల్యమైన షరతులు విధిస్తున్నామని తీర్పులో పేర్కొన్నారు.

ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయని చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.