ETV Bharat / bharat

Caste census: ఏడాది తర్వాతే కులాలవారీ జనగణన! - జనగణన 2021

దేశంలో కులాలవారీగా జనాభా(caste census) లెక్కించాలంటూ విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది. సున్నితమైన ఈ అంశంపై లాభ నష్టాలు బేరీజు వేసుకొని ఓ ఏడాది తర్వాతే నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతానికి 2021 జనాభా లెక్కలు (census) పూర్తి చేయటంపైనే దృష్టి సారించింది.

census
జనగణన
author img

By

Published : Aug 22, 2021, 6:48 AM IST

Updated : Aug 22, 2021, 7:36 AM IST

దేశంలో ప్రతి పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల సేకరణ 2020లో(census) జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా బాగా ఆలస్యమైంది. ఈలోపు భాజపాలోని ఓబీసీ లాబీతో పాటు మిత్రపక్షాలు, ప్రతిపక్ష పార్టీల నుంచి సైతం కులాలవారీగా జనాభా లెక్కలు(caste census) తేల్చాలంటూ ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఇటీవల పార్లమెంట్‌లో 127వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించే సమయంలోనూ దాదాపుగా అన్ని పార్టీలు ఇదే డిమాండ్‌ వినిపించాయి.

ప్రశ్నావళి సిద్ధం..

అయితే 2021 జనగణన(census 2021) కోసం ఇంటింటికీ తిరిగి సేకరించే ప్రశ్నావళి ఇప్పటికే సిద్ధమైంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఇతరులు అనే మూడు విభాగాలే ఉన్నాయి. ఇతరులు.. ఏ కులమో తెలిపే కాలమ్‌ లేదు. అంటే 2011 జనగణన(census 2011) నమూనానే ఇప్పుడూ అమలు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చేసింది. సామాజిక, ఆర్థిక కుల గణన (ఎస్‌ఈసీసీ)ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టేనని కేంద్రంలోని ఓ అధికారి తెలిపారు.

ఇదే సమయంలో ఈ ఏడాది చేపట్టే జనాభా లెక్కల సేకరణలో గుర్తించదగిన మార్పు ఒకటి ఉంది. అదే యాప్‌ వినియోగం. దీని ద్వారా వివరాల సేకరణ మరింత సులువు కానుంది. మునుపటిలాగే సిబ్బంది ప్రతి గడపకూ తిరుగుతారు.

ఇదీ చదవండి: జిమ్​లో సీఎం వర్క్​అవుట్లు.. వీడియో వైరల్​

Last Updated : Aug 22, 2021, 7:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.