ETV Bharat / bharat

Central Vista: సెంట్రల్​ విస్టా పనులు 60 శాతం పూర్తి! - central vista work in progress

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా తలపెట్టిన సుందరీకరణ పనులు 60 శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్రం తెలిపింది. నూతన పార్లమెంటు భవనం పనులు ఇప్పటివరకు 35 శాతం మాత్రమే పూర్తయినట్లు పేర్కొంది.

Central Vista
Central Vista
author img

By

Published : Dec 2, 2021, 10:49 PM IST

Central Vista Project Work: సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు తలపెట్టిన సుందరీకరణ పనులు ఇప్పటివరకూ 60 శాతం మాత్రమే పూర్తయినట్లు కేంద్రం తెలిపింది. ఈ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం.. వచ్చే ఏడాది జరిగే గణతంత్ర వేడుకలు సెంట్రల్‌ విస్టా మార్గంలోనే జరపాలని నిర్ణయించింది. అయితే గడువు సమీపిస్తున్నా.. పనులు పూర్తి కాకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే ఏడాది అక్టోబరు వరకు గడువు నిర్దేశించిన నూతన పార్లమెంటు భవనం పనులు ఇప్పటివరకు 35శాతం మాత్రమే పూర్తయినట్లు కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్​ తివారీ అడిగిన ప్రశ్నకు గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌషల్‌ కిషోర్‌ ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఈ పనుల కోసం ఈ ఏడాది రూ.1,289 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో భాగంగా నూతన పార్లమెంటు భవనం, కేంద్ర సచివాలయం, రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేటు వరకు 3 కిలోమీటర్ల మార్గం సుందరీకరణ, ప్రధాని నూతన నివాసం, కార్యాలయంతోపాటు ఉప రాష్ట్రపతి నూతన నివాసం పనులు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: 'కొవిడ్​పై పోరులో వివక్ష.. భాజపా పాలిత రాష్ట్రాలకే టీకాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.