ETV Bharat / bharat

'టీకాలు ఉచితంగానే అందిస్తాం'

కరోనా టీకాను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే అందించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. బహిరంగ మార్కెట్లో ఒక్కో డోసు ఖరీదు రూ.400 ఉన్నప్పటికీ.. తాము సేకరించి అందిస్తామని వెల్లడించింది. ఈ మేరకు టీకా ధరలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ ట్వీట్​పై స్పందించింది.

center vaccine
రాష్ట్రాలకు టీకా ఉచితమే: కేంద్రం
author img

By

Published : Apr 24, 2021, 1:06 PM IST

Updated : Apr 24, 2021, 1:46 PM IST

తాము సేకరించే కరోనా టీకాలను అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే అందజేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 45 ఏళ్లు పైబడిన వారి కోసం కేంద్రం ప్రస్తుతం రాష్ట్రాలకు కరోనా టీకాలను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఐతే 18 ఏళ్లు దాటిన వారికి కూడా మే 1 నుంచి టీకాలు అందజేస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. టీకా తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిలో 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు కంపెనీలకు విక్రయించుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో కొవిషీల్డ్‌ టీకాను తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్‌ టీకా ధరలను ప్రకటించింది. కేంద్రానికి విక్రయించే టీకా ఒక్కోటి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వాలకు 4వందల రూపాయలు, ప్రైవేటు కంపెనీలకు 650 రూపాయలకు విక్రయిస్తామని తెలిపింది. కేంద్ర, రాష్ట్రాలకు సరఫరా అయ్యే టీకా ధరల్లో తేడాలపై విమర్శల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ ట్విట్టర్‌లో స్పష్టత ఇచ్చింది.

టీకా కంపెనీల నుంచి తాము కొనుగోలు చేసే 50శాతం టీకాలను ఒక్కోటి 150 రూపాయలకు కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తామని ట్విట్టర్‌లో తెలిపింది.

కరోనా టీకా ధరలపై ట్వీట్​ చేసిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్.. భారత్‌లో తయారైన టీకాకు భారత్‌లోనే అత్యధిక ధర చెల్లించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం పై విధంగా స్పందించింది.

ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో 25 మంది రోగులు మృతి

Last Updated : Apr 24, 2021, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.