దేశవ్యాప్తంగా కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఎంతోమంది ఆసుపత్రి సిబ్బంది నిరంతరం శ్రమిస్తుంటే.. అక్కడక్కడా కొందరు వృత్తికి చెడ్డపేరు తెస్తూ కాసులకు కక్కుర్తి పడుతున్నారు. మహారాష్ట్రలోని ధులేలో ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఇలాంటి ఘటనే ఒకటి సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది.
ఏం జరిగిందంటే?
కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి జేబులోని డబ్బు, నగలు ఆసుపత్రి సిబ్బంది దొంగిలించారు. తర్వాత డబ్బు, నగలు పోయిన విషయాన్ని గుర్తించిన ఆ వ్యక్తి బంధువులు ఆసుపత్రి యాజమాన్య ప్రతినిధులకు ఫిర్యాదు చేయగా వారు ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారు. అనంతరం.. సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా అసలు విషయం బయటపడటం వల్ల బాధిత కుటుంబీకులే కాకుండా ఇది తెలిసిన మిగతావారు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిచెందిన కష్టకాలంలో ఇలాంటి పనులేమిటని నిలదీశారు.
ఇదీ చదవండి: 'మరో 4 వారాల్లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం'