ETV Bharat / bharat

రూ.1800 కోట్ల బ్యాంక్​ మోసం కేసులో సీబీఐ దాడులు

రబ్బర్​ ఉత్పత్తుల సరఫరా సంస్థ జయ్ పాలీకెమ్ లిమిటెడ్​ దిల్లీ కార్యాలయం సహా మూడు వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రూ.18 వందల కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఎస్​బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు చేపట్టింది.

Jay Polychem bank fraud case
జయ్​ పాలీ కెమ్​పై సీబీఐ దాడులు
author img

By

Published : Dec 4, 2020, 8:46 PM IST

రూ.1800 కోట్ల మేర బ్యాంక్​ మోసానికి పాల్పడినట్లు జయ్ పాలీకెమ్ లిమిడెడ్​పై.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి.. జయ్​ పాలీకెమ్​ కార్యాలయం సహా దిల్లీలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ సోదాలను నిర్వహించింది.

తమ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియానికి రూ.18 వందల కోట్ల మోసానికి పాల్పడినట్లు జయ్ పాలీకెమ్​ లిమిడెడ్ ప్రమోటర్లు, డైరెక్టర్లపైన ఎస్​బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది.

ఎర్నెస్ట్ అండ్ యంగ్ చేసిన ఫోరెన్సిక్ ఆడిట్​ ప్రకారం.. బ్యాంక్ మోసం, అక్రమ లావాదేవీలు, ఫోర్జరీ వంటి వాటి కింద కేసు నమోదు చేసినట్లు వివరించింది సీబీఐ.

ఇదీ చూడండి:'రూ.10కే ఉద్యోగం' పేరుతో మోసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.