పంజాబ్, హరియాణాలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)కు చెందిన దాదాపు 20 గోదాముల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ సోదాలు శుక్రవారం ఉదయం వరకు కొనసాగినట్లు సమాచారం.
గోదాముల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకే తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలతో నేరుగా లావాదేవీలు జరిగే ఇలాంటి ప్రదేశాల్లో అవినీతిని అరికట్టేందుకే ఈ సోదాలు జరిపినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌సీఐ విజిలెన్స్ బృందాలూ తనిఖీల్లో పాల్గొన్నట్లు వెల్లడించారు.