HC ALLOWS 34 WEEKS ABORTION: కోల్‌కతా హైకోర్టు అరుదైన అనుమతిలిచ్చింది. ఓ మహిళ తన 8 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. పరిశీలించిన హైకోర్టు మినహాయింపునిచ్చింది. ప్రస్తుతం ఉన్న మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ప్రకారం 24 వారాల గర్భాన్ని అబార్షన్ చేయవచ్చు. అయితే, గురువారం హైకోర్టు.. కోల్‌కతా నివాసికి 34 వారాల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతిలిచ్చింది.
అసలు ఏమైందంటే?..
కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్న ఆ మహిళ అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. సుదీర్ఘ చికిత్సల తరువాత ఆమె గర్భం దాల్చింది. తీరా గర్భం దాల్చాక ఆనారోగ్య సమస్యలు అధికమయ్యాయి. దీంతో ఆమె.. అబార్షన్‌కు అనుమతులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది. అబార్షన్ ఆలస్యమైతే ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని, ఈ విషయంలో ఎవరినీ బాధ్యులు చేయదలచుకోలేదని అందుకే అబార్షన్ చేయింకోవచ్చని కోర్టు అనుమతులిచ్చింది. ఈ తీర్పు అసాధారమైనదని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: మొబైల్ గేమ్స్‌కు బానిసై.. 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య!