Cab Drivers Murdered: దిల్లీలో ఇద్దరు క్యాబ్ డ్రైవర్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు కేవలం రూ.600, ఒక మొబైల్ కోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఓ క్యాబ్ డ్రైవర్ నుంచి రూ.450 మరో డ్రైవర్ నుంచి రూ.150 దొంగిలించినట్లు వెల్లడించారు.

Cab Drivers Killed: 'నిందుతులు ఆకాశ్ అలియాస్ అక్కు, జనైద్లు ఆనంద్ ప్రభాత్ ప్రాంతానికి చెందినవారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వీరు.. మత్తుపదార్థాల కోసం క్యాబ్ బుక్ చేసి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలనే కుట్రపన్నారు. శుక్రవారం రాత్రి 1 గంటల సమయంలో కమల్ టీ పాయింట్ వద్ద క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్‌లో కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత డ్రైవర్ చవ్వీనాత్ అనే వ్యక్తిని వెనకనుంచి గొంతు నులిమి చంపారు. బాధితుని వద్ద ఉన్న డబ్బును, ఫోన్‌ను తీసుకుని, కారును, మృతదేహాన్ని వేర్వేరు చోట్ల పడేసి వెళ్లిపోయారు. ఉదయం 6.45 ప్రాంతంలో ఆనంద్ ప్రతాప్ నుంచి మరోసారి క్యాబ్ బుక్ చేసి ఇంతకుముందులాగానే ఘాతుకానికి పాల్పడ్డారు. ఉదయం 8.45 సమయంలో అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు చికిత్స పొందుతూ మరణించాడు. బాధితుడు అనిల్ యాదవ్(48)గా గుర్తించాము' అని డీసీపీ శ్వేతా ఛౌహాన్ తెలిపారు.
Cab Drivers Murdered in Delhi: కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. అయితే.. ఈ రెండు ఘటనల్లో క్యాబ్ బుక్ చేసిన ఫోన్ నెంబర్ ఒకటేనని గుర్తించారు. సాంకేతికతను ఉపయోగించి పోలీసులు ఈ కేసును ఛేదించారు. నెహ్రూ నగర్ కాలనీకి చెందినవాడిగా నిందితుడు ఆకాశ్(19)గా గుర్తించారు. మొబైల్ కంపెనీలో పనిచేస్తుండేవాడని తెలిపారు. చికెన్ షాప్‌లో తన తండ్రితో పాటు కలిసిపని చేసేవాడిగా జునైద్‌ను గుర్తించారు.
ఇదీ చదవండి: పంజాబ్ పోలీసులకు కొత్త బాస్- ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ