ETV Bharat / bharat

ప్రపంచ ప్రఖ్యాత గణాంక నిపుణుడు సీఆర్​ రావుకు అత్యున్నత పురస్కారం.. - Indian American mathematician C R Rao

CR RAO: ప్రపంచ ప్రఖ్యాత స్టాటిస్టిక్స్‌ నిపుణుడు సీఆర్‌ రావుకు గణాంక రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. గణాంక శాస్త్ర రంగంలో నోబెల్‌ అవార్డుగా భావించే ఇంటర్నేషల్‌ ప్రైజ్‌ ఇన్‌ స్టాటిస్టిక్స్‌ అవార్డు ఆయనను వరించింది.

CR RAO
CR RAO
author img

By

Published : Apr 10, 2023, 4:40 PM IST

CR RAO: ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త, భారతీయ-అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు కల్యంపూడి రాధాకృష్ణారావుకు స్టాటిస్టిక్స్​ రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 75 ఏళ్ల క్రితం గణాంక ఆలోచనలో విప్లవాత్మకమైన కృషి చేసినందుకు గాను ఈ రంగంలో నోబెల్ బహుమతికి సమానమైన 2023 అంతర్జాతీయ గణాంక బహుమతిని ఆయన అందుకోనున్నారు. 75 సంవత్సరాల క్రితం రావు చేసిన కృషి.. ఇప్పటికీ సైన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూనే ఉందని ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే జులైలో కెనడాలో ఒంటారియోలోని ఒట్టావాలో జరిగే ద్వైవార్షిక ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఆర్‌ రావు ఈ అవార్డును అందుకుంటారు.

అసలేమిటీ ఆయన పరిశోధనలు: 1945లో కలకత్తా మ్యాథమెటికల్‌ సొసైటీలో ప్రచురితమైన సీఆర్‌ రావు పరిశోధన పత్రానికిగాను ఈ అవార్డు దక్కింది. ఆధునిక గణాంకాల రంగానికి మార్గం సుగమం చేసిన సీఆర్​ రావు.. మూడు ప్రాథమిక ఫలితాలను పరిశోధించారు.. అవి నేటి సైన్స్‌లో ఎక్కువగా ఉపయోగించే గణాంక సాధనాలను అందించారని ఫౌండేషన్ సంస్థ ఏప్రిల్ 1 న ఒక ప్రకటనలో తెలిపింది.

మొదటిది.. క్రామెర్-రావ్ బౌండ్​, రెండవది రావు-బ్లాక్‌వెల్ సిద్ధాంతం (ప్రముఖ గణాంకవేత్త డేవిడ్ బ్లాక్‌వెల్ ద్వారా స్వతంత్రంగా కనుగొన్నందు వల్ల) ఒక అంచనాను మెరుగైన వాస్తవానికి, సరైన అంచనాగా మార్చడానికి.

చివరిది.. సమాచార జ్యామితిగా అభివృద్ధి చెందిన కొత్త ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్‌కు మార్గదర్శకత్వం. ఈ ఫలితాలు శాస్త్రవేత్తలు డేటా నుంచి సమాచారాన్ని మరింత సమర్ధవంతంగా సేకరించేందుకు సహాయపడతాయని ఆ ప్రకటనలో తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన కణ యాక్సిలరేటర్ అయిన లార్జ్ హాడ్రాన్ కొలైడర్ వద్ద హిగ్స్ బోసాన్ కొలతలను అర్థం చేసుకోవడానికి, ఆప్టిమైజేషన్ చేయడానికి సమాచార జ్యామితి ఇటీవల ఉపయోగించారు.

అవార్డు: ఐదు ప్రముఖ అంతర్జాతీయ గణాంకాల సంస్థల సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి గణాంకాలలో అంతర్జాతీయ బహుమతిని అందజేస్తారు. గణాంక రంగంలో ఒక వ్యక్తి లేదా బృందం సాధించిన ప్రధాన విజయాన్ని గుర్తించి దీనిని అందజేస్తారు. నోబెల్ బహుమతులు, అబెల్ ప్రైజ్, ఫీల్డ్స్ మెడల్, ట్యూరింగ్ అవార్డుల తర్వాత ఈ బహుమతి రూపొందించారు.

సంక్లిష్ట అధ్యయనాలలో రోగి మనుగడ రేటును పరిశోధించడానికి పరిశోధకులను అనుమతించే కాక్స్ అనుపాత ప్రమాదాల నమూనా అభివృద్ధి కోసం 2017లో డేవిడ్ ఆర్ కాక్స్‌ గణాంకాలను రూపొందించారు. ఇందులో మొదటి అంతర్జాతీయ బహుమతి ఆయనకు లభించింది. బూట్‌స్ట్రాప్ అని పిలువబడే గణాంక పద్ధతికి 2019లో బ్రాడ్లీ ఎఫ్రాన్ అవార్డును అందుకున్నారు. బూట్​స్ట్రాప్​ అంటే అనువర్తిత గణాంకాలలో అనిశ్చితిని అంచనా వేయడానికి ఒక తెలివైన గణన పద్ధతి.

కర్ణాటకలో పుట్టి.. ఆంధ్రాలో విద్యాభ్యాసం పూర్తి చేసి: ప్రపంచ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త, పద్మవిభూషణ్‌ ప్రొఫెసర్‌ కల్యంపూడి రాధాకృష్ణరావు(సీఆర్‌ రావు) 2020 సెప్టెంబర్​10 గురువారం నాడు వందో పుట్టినరోజు జరుపుకున్నారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ బఫలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు.

హైదరాబాద్‌లోని సీఆర్‌రావ్‌ అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ వ్యవస్థాపకులైన సీఆర్‌ రావు 1920 సెప్టెంబర్‌ 10న బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామల్లో ఆయన బాల్యం గడిచింది. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్‌ చేసిన ఆయన యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎంఏ స్టాటిస్టిక్స్‌ చేశారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని కింగ్స్‌ కాలేజీలో 1948లో పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరి అదే సంస్థకు డైరెక్టర్‌గా ఎదిగారు.

సీఆర్‌ రావు సేవలు కేవలం స్టాటిస్టికల్‌ రంగానికే కాకుండా ఎకనమిక్స్‌, జెనిటిక్స్‌, ఆంత్రోపాలజీ తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్లు బుధవారం నాటి వెబినార్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 19 దేశాలనుంచి 39 డాక్టరేట్లు అందుకున్న ఆయన ఇప్పటివరకు 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 2002లో అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ చేతులమీదుగా ఆ దేశ అత్యున్నత నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌ పురస్కారం అందుకున్నారు. యూకే ఇంటర్నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్స్‌, ఇంటర్నేషనల్‌ బయోమెట్రిక్‌ సొసైటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్టాటిస్టిక్స్‌ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రొఫెసర్‌ రావును భారత ప్రభుత్వం 1968లో పద్మభూషణ్‌, 2001లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.