రాజ్యసభ బడ్జెట్ సమావేశాల తొలిభాగం శుక్రవారం(ఫిబ్రవరి 12)తో ముగియనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. బిజినెస్ అడ్వైజర్ కమిటీలో నిర్ణయం తీసుకునట్లు వెల్లడించాయి. శనివారం(ఫిబ్రవరి 13) వరకు సమావేశాలు జరపాలని ముందుగా నిర్ణయించినా.. ఒకరోజు ముందుగానే ముగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు లోక్‌సభను శనివారం జరపాలని నిర్ణయించినట్లు తెలిపాయి.
రాజ్యసభలో బడ్జెట్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇవ్వనున్నట్లు పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. అనంతరం రాజ్యసభను మార్చి 8కి వాయిదా వేయనున్నట్లు తెలిపాయి. అదే తరహాలో.. శనివారం లోకసభను కూడా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈనెల 15 వరకు ఉభయ సభలు జరపాలని ముందుగా అనుకున్నా.. నిర్ణయాన్ని మార్చుకుంది.
తిరిగి మార్చి 8 నుంచి రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: 'ఆపరేషన్ ఉత్తరాఖండ్'లో మరో అవాంతరం