పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాకిస్థాన్ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన చొరబాటుదారుడిని భారత సైన్యం కాల్చి చంపింది. మంగళవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో గురుదాస్‌పుర్ సెక్టార్‌లోని చన్నా సరిహద్దు పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. అతడి దగ్గర అధునాతన 'పంప్ యాక్షన్' షాట్‌గన్ లాంటి ఆయుధాలున్నాయని అధికారులు చెప్పారు.
2023లో సరిహద్దు వద్ద పాకిస్థాన్ చొరబాటుదారుడు మరణించిన మొదటి సంఘటన ఇది. 2022లో పంజాబ్‌లోని 553 కిలోమీటర్ల పొడవైన భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇద్దరు చొరబాటుదారులను బీఎస్ఎఫ్ దళం హతమార్చింది, 23 మంది పాకిస్థానీలను పట్టుకుంది. అలాగే డిసెంబరు 31న గురుదాస్‌పుర్ సెక్టార్‌లోని కస్సోవాల్ ప్రాంతంలో కూల్చేసిన డ్రోన్‌లో 1 కిలోల హెరాయిన్‌ను సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి:
దేశంలో తగ్గిన కరోనా కేసులు.. రెండో బూస్టర్ డోస్ తీసుకోవడంపై కేంద్రం క్లారిటీ!
భావ ప్రకటనపై సుప్రీం కీలక తీర్పు.. ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ఆంక్షలు కుదరవ్!