Brunei King Hassanal Bolkiah Luxury: ఈ ప్రపంచంలో.. కారు ఒక స్టేటస్ సింబల్. ఎంత ఖరీదైన కారు ఉంటే.. అంత గొప్ప అన్నట్టు! అందుకే.. లగ్జరీకి బ్రాండ్ అంబాసిడర్లా పిలుచుకునే రోల్స్ రాయిస్ కారును.. ఇంటికి తెచ్చుకోవాలని ఆరాటపడుతుంటారు బిగ్ షాట్స్. కానీ.. అందరికీ సాధ్యం కాదు. చాలా తక్కువ మంది మాత్రమే ఆ కారును కొనుగోలు చేయగలరు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వ్యక్తి వద్ద.. ఏకంగా 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి! అంతేకాదు.. అత్యంత ఖరీదైన ఫెరారీ కార్లు 300 పైనే ఉన్నాయి. ఇంతకీ.. అతను ఎవరంటే..? "బ్రూనై" దేశ సుల్తాన్ హసనల్ బోల్కియా.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా!: బ్రూనైలో సుల్తాన్‌గా వ్యవహరిస్తున్న హసనల్ బొల్కియా.. ఆ దేశానికి రాజు. ఆయన సంపాదన మామూలుగా ఉండదు. ఊహించటానికీ సాధ్యం కాదు. 1980 వరకు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు హోదా అనుభవించారు. హసనల్ బోల్కియా వద్ద రూ. 14,700 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక, లగ్జరీ కార్ల విషయంలో ఆయన టాప్‌లో ఉంటారు. బంగారు తాపడం చేయించిన భవంతి.. అతి పెద్దదైన ఇల్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది.
బన్నీ ఇల్లు రూ.100 కోట్లు.. మహేశ్ విల్లా రూ.80 కోట్లు.. మరి సామ్‌ది ఎంతో తెలుసా?
7 వేల కార్లు : హస్సనల్ బోల్కియా వద్ద మొత్తం 7 వేల కార్లున్నాయి. అవన్నీ లగ్జరీ కార్లే. వీటిలో 600 రోల్స్ రాయిస్, 300 ఫెరారీలు ఉన్నాయి. వీటి విలువ సుమారు 341 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఆ కార్లలో కొన్నింటికి బంగారంతో కోటింగ్ వేయించారు. ఈ కార్లతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. కొన్ని నివేదికల ప్రకారం 1990 మధ్యలో కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్, బెంట్లీ కార్లలో దాదాపు సగం సుల్తాన్, అతని కుటుంబానికి వద్దనే ఉన్నాయి!
Hardik Pandya Watch Collection : హార్దిక్ వార్డ్‌రోబ్‌లో రూ. 2 కోట్ల వాచ్.. ఇంకా ఎన్ని ఉన్నాయంటే ?
ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్: భారతీయ బిలియనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబం నివసిస్తున్న ఇల్లు 'ఆంటిలియా’ ఎంత పెద్దదో అందరికీ తెలిసిందే. కానీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు బ్రూనై సుల్తాన్ దే. దీనిని ‘ఇస్తానా నూరుల్ ఇమాన్ అని పిలుస్తారు. ఈ ప్యాలెస్.. బ్రూనై సుల్తాన్ అధికారిక నివాసంగా ఉంది. చదరపు విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లుగా ఉంది.
ఈ ప్యాలెస్‌ను 1984లో బోల్కియా చాలా ఇష్టంతో కట్టించుకున్నారు. ఈ భవనం 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగారపు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంటుంది. ఈ ప్యాలెస్ గోపురాన్ని 22 క్యారెట్ల బంగారంతో తాపడం చేయించారు. ఈ ప్యాలెస్ విలువ రూ. 2,550 కోట్లకు పైమాటే అని నిపుణులు అంచనా వేస్తారు. ఇందులో.. 1700కి పైగా గదులు, 257 బాత్రూంలు, ఐదు స్విమ్మింగ్ పూల్స్, 110 గ్యారేజీలు, గుర్రాలకు ప్రత్యేకంగా 200 ఎయిర్ కండిషన్డ్ గదులున్నాయి. ఈ బంగారపు ప్యాలెస్ ముందు ఓ కొలను ఉంటుంది. ఆ కొలనులో బంగారు రంగులో మెరిసిపోయే ప్యాలెస్ అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవంటే నమ్మాల్సిందే.
నయా బుల్లెట్ ప్రూఫ్ SUV కొన్న సల్మాన్.. ఆ కారులోనే చక్కర్లు.. అదే కారణమా!
అంతే కాకుండా ఆ ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా బంగారమే కనిపిస్తుంది. డైనింగ్ టేబుల్, తినే కంచాలు, గిన్నెలు, గ్లాసులు, స్పూన్లు, ఫోర్కులు, ఫ్లవర్ వాజ్‌లు, మంచాలు, వేసుకునే బట్టలు, ఆఖరికి బాత్రూమ్లో బాతింగ్ టబ్‌లు కూడా బంగారంతో చేసినవే! అంతేకాదండోయ్ ఈ రాజుగారికి పలు ప్రైవేట్ జెట్లు కూడా ఉన్నాయి. బోయింగ్ 747-400 బోయింగ్ 767-200, ఎయిర్ బస్ ఎ 340-200 జెట్ లు ఉన్నాయి. బోయింగ్ 747-400 జెట్‌కు బంగారు పూత పూయించారు. ఈ విమానంలో సౌకర్యాలకు కొదవేలేదు. లివింగ్ రూమ్ సహా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. "రాజు తలుచుకుంటే.. కొదవా?" ఇదేనేమో కదా!
Ambani Life Style : 168 కార్లు.. 3 విమానాలు.. రోజు ఇలా ఆరంభం!