ETV Bharat / bharat

ఇంటి యజమాని​ భార్య, కూతురుపై 'బ్రదర్స్​' రేప్​.. బ్లాక్​మెయిల్​ చేస్తూ అనేక సార్లు.. - rape on house owner wife

తమ ఇంటి యజమాని భార్య, కుమార్తెను బ్లాక్​ మెయిల్​ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు సోదరులు. గుజరాత్​లోని వడోదరలో ఈ ఘటన వెలుగుచూసింది. మరోవైపు, అదే రాష్ట్రంలో ఓ మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

Heretic brothers raped and blackmailed the owner's wife and daughter in Vadodara

author img

By

Published : Sep 26, 2022, 10:34 PM IST

Updated : Sep 26, 2022, 11:01 PM IST

Rape On House Owner Wife Daughter: గుజరాత్​లోని వడోదరలో దారుణ ఘటన వెలుగు చూసింది. అద్దె ఇంట్లో ఉంటున్న ఇద్దరు సోదరులు.. తమ యజమాని భార్యతోపాటు ఆమె కుమార్తెను బ్లాక్​ మెయిల్​ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితులిద్దరిని అరెస్ట్​ చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. నగరంలో మోను అన్సారీ, మహోరామ్​ అన్సారీ అనే ఇద్దరు సోదరులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే తమ ఇంటి యజమాని భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోనూ అన్సారీ. ఆ తర్వాత డబ్బులు కూడా డిమాండ్​ చేశాడు. బ్లాక్​ మెయిల్​ చేస్తూ రెండున్నరేళ్ల పాటు అనేక సార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత యజమాని కుమర్తెను రేప్​ చేశాడు.

ఇవి తెలుసుకున్న మహోరామ్​ అన్సారీ.. తల్లీకూతుళ్లను బ్లాక్​ మెయిల్​ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు వీరి ఆగడాలు భరించలేక యజమాని భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్​ చేశారు. తల్లీకూతుళ్లకు వైద్యపరీక్షలు జరిపించారు.

చెరువులో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య..
గుజరాత్​లోని అహ్మదాబాద్​లో విషాదం నెలకొంది. నగరానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెతో కలిసి.. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

పోలీసుల వివరాల ప్రకారం.. సిటీలోని కృష్ణానగర్​కు చెందిన భారతీ మోదీ(27).. తన కుమార్తె జియా(6)తో కలిసి కూరగాయలు కొంటానని చెప్పి ఇంటి నుంచి మార్కెట్​కు బయలుదేరింది. మార్గమధ్యలో ఉన్న చెరువులో కుమార్తెతో కలిసి భారతి చెరువులోకి దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాల వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: విదేశాలకు వెళ్లేవారికి గుడ్​న్యూస్​.. ఇక ఆ సర్టిఫికెట్‌ అప్లై ఆన్‌లైన్‌లోనే!

దసరా పండుగ వేళ భారీ కుట్ర!.. భాజపా, ఆర్​ఎస్ఎస్ నేతలే 'పీఎఫ్ఐ' టార్గెట్​!!

Last Updated : Sep 26, 2022, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.