ETV Bharat / bharat

Viral: నవ వధువుకు 'పానీపూరీ' కిరీటం

author img

By

Published : Jul 6, 2021, 1:24 PM IST

Updated : Jul 6, 2021, 2:10 PM IST

పానీపూరిపై ప్రేమ, ముఖంపై చిరునవ్వుతో.. ఓ వధువు నెటిజన్ల మనసు దోచేసింది. ఇన్​స్టా వేదికగా ఆమె పోస్ట్​ చేసిన ఓ వీడియో విపరీతంగా వైరల్ అయింది​. అసలేం జరిగిందంటే..

viral bride, golgappa
పానీపూరీ, వైరల్​ వధువు

పానీపూరీని చాలా మంది అమితంగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు, మహిళలకు ఇవి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఓ వధువు తనదైన శైలిలో పానీపూరీపై అభిమానం చాటుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారారు. ఇంతకీ ఆమె ఏం చేశారంటే..

చిరునవ్వు చిందిస్తూ..

అక్షర అనే ఓ నవ వధువు 'పానీపూరీ' కారణంగా ఫేమస్​ అయ్యారు. పానీపూరీ కిరీటం తలకు ధరించి పూల దండకు బదులుగా గోల్​గప్పతో చేసిన మాలను మెడలో వేసుకున్నారు. ఆ కిరీటం ధరించగానే ఆమె ముఖంపై చిందించిన చిరునవ్వు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఇన్​స్టా వేదిగా పోస్ట్ చేసిన ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. యువతులకు పానీపూరీ అంటే ఎందుకంత ఇష్టం? అని ఓ నెటిజన్​ ప్రశ్నించగా.. ఇలా పెళ్లి చేసుకోవడం ట్రెండ్​గా మారిందంటూ మరో నెటిజన్​ కామెంట్ చేశాడు. ఇలా వెరైటీగా పెళ్లి చేసుకోవాలని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

ఇదీ చదవండి:నెట్​వర్క్ సమస్యను అధిగమించేందుకు 'ట్రీ హౌస్'​ ఉపాయం!

Last Updated : Jul 6, 2021, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.