ETV Bharat / bharat

ఫస్ట్​ నైట్​లో వధువు చెప్పిన నిజంతో వరుడు షాక్​.. స్పాట్​లోనే విడాకులు! - మధ్యప్రదేశ్​ న్యూస్

వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట కేవలం ఒక్క నిజం కారణంగా విడిపోయారు. కోర్టును ఆశ్రయించి పెళ్లిని రద్దు చేసుకున్నాడు ఆమె భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో వెలుగుచూసింది. ఇంతకీ ఏం జరిగింది ? వీరు విడిపోవడం వెనుక కారణం ఏంటి?

d
ఫస్ట్​నైట్​ రోజు వధువు చెప్పిన నిజంతో వరుడు షాక్​.. వివాహ బంధానికి చెక్​!
author img

By

Published : Apr 8, 2022, 12:44 PM IST

బంధువుల సమక్షంలో వైభవంగా ఆ జంట పెళ్లి జరిగింది. నవదంపతులు ఉత్సాహంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఫస్ట్​ నైట్​ రోజున వారి జీవితాల్లో జరిగిన ఎన్నో సంఘటనలు, మంచి-చెడు గురించి చెప్పుకోసాగారు. ఈ క్రమంలో వధువు చెప్పిన ఓ చేదు నిజం అప్పటివరకు వారి మధ్య ఉన్న సంతోషాన్ని దూరం చేసింది. వారి బంధం ముగిసేలా చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​లో జరిగింది.

ఇదీ జరిగింది..: తన జీవితంలోని పలు విషయాలను భర్తతో పంచుకుంటున్న యువతి.. గతంలో తనపై అత్యాచారం జరిగిందని వెల్లడించింది. ఈ మాటలకు షాక్​ తిన్న భర్త మరుసటి రోజే యువతిని ఆమె పుట్టింట్లో విడిచిపెట్టేశాడు. బంధువులకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో యువతిపై అత్యాచారానికి పాల్పడింది ఆమె మేనమామ కొడుకని తెలిసింది. తమ వివాహాన్ని రద్దు చేయాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. మరోవైపు బాధితురాలు కూడా అత్యాచారానికి పాల్పడిన నిందితుడిపై ఫిర్యాదు చేసింది. యువకుడి పిటిషన్​ మేరకు న్యాయస్థానం విచారణ చేపట్టింది. అయితే ఎన్నిసార్లు నోటీసులు పంపినా అతని భార్య కోర్టుకు హాజరుకాలేదు. ఇలా మూడేళ్ల పాటు సాగిన విచారణను ముగిస్తూ ఇటీవల కోర్టు తీర్పునిచ్చింది. యువకుడు కోరిన విధంగా 2019లో జరిగిన ఆ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : 'ఫ్రీ ఫైర్'​కు బానిస.. అనుక్షణం అదే కలవరింపు.. గాల్లో గన్​ పేల్చుతూ...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.