Bride Refuses To Marry Groom In Karnataka : పెళ్లి కుమార్తె మెడలో వరుడు తాళి కట్టే ముందు 'ఆపండి' అని అరవడం సినిమాల్లో చూస్తుంటాం. వరుడితో పెళ్లి తనకు ఇష్టం లేదని వేరే వ్యక్తిని ప్రేమించానని చెబుతుంటారు కొందరు వధువులు. మరికొందరు ఈ వరుడిని పెళ్లి చేసుకోనని తాళి కట్టే ముందు చెప్పి షాక్ ఇస్తారు. అచ్చం అలాంటి ఘటనే కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జరిగింది. మరెందుకు ఆ యువతి పెళ్లికి నిరాకరించిందో? పెళ్లి ఆగిపోతే వధువు తరఫు వారు ఊరుకున్నారా? ఈ కథనంలో తెలుసుకుందాం.
హోసదుర్గ తాలూకాలోని చిక్కబ్యాలదకెరె గ్రామానికి చెందిన ఓ యువకుడికి యువతితో కొన్నాళ్ల క్రితం వివాహ సంబంధం కుదిరింది. వీరి పెళ్లికి గురువారం(డిసెంబరు 12)న ముహుర్తంగా నిర్ణయించారు పెద్దలు. ఈ క్రమంలో వరుడి కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చిక్కబ్యాలదకెరెలోని భైవవేశ్వర్ కళ్యాణమండపానికి వరుడు, వధువు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు భారీగా వచ్చారు. పెళ్లి తంతులో భాగంగా వధువు మెడలో వరుడు తాళి కట్టేందుకు సిద్ధమయ్యాడు. తన మెడలో మంగళసూత్రాన్ని కట్టించుకునేందుకు వధువు నిరాకరించింది. తన ఈ పెళ్లి ఇష్టం లేదని చప్పట్లు కొడుతూ చెప్పింది. దీంతో పెళ్లి ఆగిపోయింది.
అప్పుడు వధువును పెళ్లికి ఒప్పించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నించారు. అయినా వధువు అంగీకరించలేదు. అప్పుడు వధువు తీరుపట్ల వరుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వధువు కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. చివరకు ఈ విషయం శ్రీరాంపుర్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్లికి అయిన ఖర్చులు వధువు తరఫువారే భరించుకోవాలని పోలీసులు ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చడం వల్ల గొడవ సద్దుమణిగింది.
Strange Wedding In UP : కొన్నాళ్ల క్రితం వరుడు.. దేశ ప్రధాన మంత్రి పేరు చెప్పలేదని జరిగిన పెళ్లిని రద్దు చేసుకుని అక్కడికక్కడే పెళ్లికొడుకు తమ్ముడిని వివాహం చేసుకుంది ఓ యువతి. వరుడిని చూసి వధువు తరఫు బంధువులు హేళన చేశారనే కారణంతో ఆ యువతి ఇలా చేసింది. కొన్నాళ్ల క్రితం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్ జిల్లాలో ఈ వింత ఘటన జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
నుదిటిపై సింధూరం పెట్టకుండా ముఖంపై చల్లిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వధువు!
లెహంగా నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. పోలీస్ స్టేషన్లో హైడ్రామా