Borewell Rescued Girl Died : గుజరాత్‌లోని దేవ్‌భూమి ద్వారక జిల్లాలో 30 అడుగుల బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాయక బృందాలు అనేక గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారిని బయటకు తీసినా లాభం లేకుండా పోయింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం- జిల్లాలోని రాన్ గ్రామానికి చెందిన బాలిక ఏంజెల్ షఖ్రా సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. అది గమనించిన గ్రామస్థులు చిన్నారి రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారులకు విషయాన్ని చేరవేశారు. సమచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి స్థానిక అధికారులు చేరుకున్నారు. బోర్వెల్లోకి ఆక్సిజన్‌ను పంపించారు.
ఆ తర్వాత చిన్నారిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగాయి. ఎల్ ఆకారంలోని హుక్తో బాలికను తాడుతో కట్టి 15 అడుగుల మేర పైకి తీసుకొచ్చారు. బోర్ బావికి సమాతరంగా తవ్వకాలు కూడా జరిపారు. అలా రాత్రి 9.50 గంటల ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే చికిత్స కోసం అంబులెన్స్‌లో జామ్ ఖంభాలియా పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలిక మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఆమె మృతికి ఊపిరాడకపోవడమే ప్రాథమిక కారణంగా తెలుస్తోందని చెప్పారు. తమ పాప మృంత్యుంజయురాలిగా తిరిగొచ్చిందని సంతోషించే లోపే శాశ్వతంగా దూరం కావడం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
-
#WATCH | Gujarat: Indian Army personnel join the rescue operation that is underway to rescue a 2.5-year-old girl who fell into a borewell in Ran village of Kalyanpur tehsil of Dwarka district. pic.twitter.com/MGfBWllIby
— ANI (@ANI) January 1, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Gujarat: Indian Army personnel join the rescue operation that is underway to rescue a 2.5-year-old girl who fell into a borewell in Ran village of Kalyanpur tehsil of Dwarka district. pic.twitter.com/MGfBWllIby
— ANI (@ANI) January 1, 2024#WATCH | Gujarat: Indian Army personnel join the rescue operation that is underway to rescue a 2.5-year-old girl who fell into a borewell in Ran village of Kalyanpur tehsil of Dwarka district. pic.twitter.com/MGfBWllIby
— ANI (@ANI) January 1, 2024
బోరుబావిలో పడిన వారిని రక్షించేందుకు కెమెరా!
అయితే బోరుబావిలో పడిన వారిని రక్షించడం కోసం ఒడిశాకు చెందిన ఓ ఇంజనీర్ కెమెరాను ఇటీవలే తయారు చేశారు. 50 అడుగుల లోతులో ఆడియో, వీడియోలను రికార్డు చేయగలగే సామర్థ్యంతో అతి తక్కువ ఖర్చుతో కెమెరాను అభివృద్ధి చేశారు. కేవలం రెండు రోజుల్లోనే రూ. 10 వేల రూపాయలతో రూపొందించారు.. ఈ కెమెరాలో చిన్న మానిటర్, ఐదు మెగాపిక్సిల్ కెమెరా, 12 వోల్ట్ రీఛార్జ్ చేయగల బ్యాటరీ, మైక్రోఫోన్, బ్లూటూత్, కేబుల్, ఛార్జర్ ఉన్నాయి. ఇంతకీ అతడు ఎవరు? ఆ పరికరానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3 రోజులుగా బోరుబావిలోనే బాలుడు.. అధికారి కొడుకైతే ఇంత టైమ్ పట్టేదా అంటూ తల్లి సీరియస్
బోరుబావి నుంచి బాలుడు బయటకు.. NDRF ఆపరేషన్ సక్సెస్.. హుటాహుటిన ఆస్పత్రికి!