ETV Bharat / bharat

బాలీవుడ్ ట్విట్టర్​ వార్​ వయా రైతు నిరసనలు - భారత విదేశాంగ శాఖ

సాగు చట్టాలపై రైతుల నిరసనల సెగ బాలీవుడ్​కు తాకింది. ఈ విషయంపై విదేశీ ప్రముఖులు స్పందించడంపై బాలీవుడ్​లో ఓ వర్గం మండిపడుతుంటే.. మరో వర్గం, విదేశీ ప్రముఖులకు, రైతులకు మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ట్విట్టర్​ వార్ జరుగుతోంది.

Bollywood stars' near identical tweets
బాలీవుడ్ ట్విట్టర్​ వార్​ వయా రైతు నిరసనలు
author img

By

Published : Feb 5, 2021, 5:57 AM IST

Updated : Feb 5, 2021, 6:40 AM IST

రైతుల ఆందోళనపై విదేశీ ప్రముఖులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని స్టార్​ హీరోలు అక్షయ్ కుమార్​, అజయ్​ దేవ్​గణ్​ సహా ఇతర తారలు పిలుపునిచ్చిన తర్వాత బాలీవుడ్​లో ట్విట్టర్​ వార్ మొదలైంది. పాప్​ సింగర్​ రిహానా, పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్​బర్గ్​ రైతులకు మద్దతుగా చేసిన ట్వీట్​లకు​ ప్రతిస్పందనగా.. అక్షయ్ కుమార్​, అజయ్​ దేవ్​గణ్​ సహా పలువురు సినీ, క్రీడా ప్రముఖులు చేసిన ట్వీట్​లపై ఇప్పుడు దుమారం రేగుతోంది.

వీరంతా ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతున్నారని.. నటి తాప్సీ, సినీ నిర్మాత ఒనిర్​, నటుడు అర్జున్​ మాథుర్ సహా పలువురు ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు.

రైతులకు మద్దతుగా నిలిచిన నటి తాప్సీ 'ఒక ట్వీట్​ మీ ఐక్యతను దెబ్బతీస్తే, ఒక జోక్ మీ నమ్మకాన్ని లేదా ఒక షో మీ మత విశ్వాసాన్ని దెబ్బతీస్తే.. మీ విలువల వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతే కానీ ఇతరులకు ప్రచార గురువులుగా మారకూడదు.' అని ట్వీట్​ చేసింది.

Tapsee tweet
తాప్సీ ట్వీట్​

అక్షయ్​ కుమార్ సరసన పలు సినిమాల్లో నటించిన.. నటి సోనాక్షీ సిన్హా కూడా రిహానా ట్వీట్​కు మద్దతు తెలిపారు. ఈ విషయంపై తన ఇన్​స్టా స్టోరీలో పలు విషయాలను పంచుకున్నారు. రైతుల అంశం భారత అంతర్గతమనే వాదననూ ఆమె తోసిపుచ్చారు. 'వీళ్లంతా గ్రహాంతర వాసులు కాదు.. సాటి మనుషులకోసం మాట్లాడుతున్న వాళ్లు' అని పేర్కొన్నారు.

సినీ ప్రముఖుల నుంచి ప్రభుత్వానికి వస్తున్న మద్దతు చూస్తే గుండె పగిలిపోతుందని టీవీ వ్యాఖ్యాత, నటుడు సుశాంత్​ సింగ్ అన్నారు. నటి స్వర భాస్కర్​ సహా పలువురు ప్రముఖులు కూడా తమదైన శైలిలో ఈ విషంపై స్పందించారు.

అసలు విషయమేమిటంటే..

అన్నదాతలు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను రద్దు చేసిన కథనాన్ని ట్విట్టర్​లో షేర్ చేసిన పాప్​ సింగర్ రిహానా.. ఈ విషయంపై మనం ఎందుకు మాట్లాడటం లేదంటూ ఇటీవల ప్రశ్నించారు. 'భారత్​లో జరుగుతున్న రైతుల నిరసనకు మేం సంఘీభావం తెలుపుతున్నాం. 'అంటూ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్​బర్గ్ ప్రకటించారు. వీరితో పాటు.. మరికొంతమంది అంతర్జాతీయ ప్రముఖులు ఈ విషయంపై స్పందించారు.

ఈ నేపథ్యంలో.. రిహానా, గ్రేటా ట్వీట్లపై భారత విదేశీ వ్యవహార శాఖ ఘాటుగా స్పందించింది. కాసేపటికే బాలీవుడ్​ తారలు ఈ విషయంపై తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. అయితే ఇందులో చాలా మంది ట్వీట్​లు ఒకేలా ఉండటం, ప్రభుత్వానికి మద్దతు తెలిపేలా ఉన్నాయనే కారణంతో బాలీవుడ్​లో మరో వర్గం విమర్శలు చేస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Feb 5, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.