పొరపాటున నీటికి బదులు శానిటైజర్ తాగేశారు బృహత్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఉన్నతాధికారి ఒకరు. బీఎంసీ నిర్వహించిన విద్యా బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న సంయుక్త మున్సిపల్ కమిషనర్ రమేశ్ పవార్ మంచినీళ్ల సీసాకు బదులు అక్కడే ఉన్న శానిటైజర్ బాటిల్ మూత తీసి తాగేశారు.
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. అది శానిటైజర్ అని చెప్పి నీళ్ల బాటిల్ ఇచ్చారు. బయటకు వెళ్లిన ఆయన.. నోటిని శుభ్రపరుచుకుని తిరిగి సమావేశానికి హాజరయ్యారు.
పోలియో కార్యక్రమంలోనూ ఇలాగే..
మహారాష్ట్రలో మూడు రోజుల క్రితమే అధికారుల నిర్లక్ష్యంతో 12మంది చిన్నారులకు పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేశారు. దీంతో ఆ చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారు.
ఇదీ చూడండి: 'రైతులతో అలాంటి చర్చలు జరపలేదు'