ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రజాసేవకు 2 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైంది. మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 వ తేదీ నుంచి 20 రోజులపాటు 'సేవా సమర్పణ్' పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
2014లో మోదీ(Modi News) ప్రధాని అయినప్పటి నుంచి ఆయన జన్మదినాన్ని 'సేవా దివస్'గా జరుపుతున్న భాజపా.. వారం రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ ప్రజా సేవలో 20ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈసారి సేవా కార్యక్రమాలను 20 రోజులకు పొడిగించారు.
వైద్య, రక్తదాన శిబిరాలు సహా పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ శ్రేణులకు సూచించారు.
ఇదీ చూడండి: 86ఏళ్ల వయసులో 10వ తరగతి పాసైన మాజీ సీఎం..