ETV Bharat / bharat

పార్టీలకు విరాళాల వరద.. భాజపాకే అత్యధికం - పార్టీల విరాళాలు

Parties Corporate Donations: దేశంలో జాతీయపార్టీలకు విరాళాల వరద ఉప్పొంగింది. వ్యాపార సంస్థలు, కార్పొరేట్​ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో భాజపాకు అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు ఉన్నాయి.

Parties Corporate Donations
విరాళాలు
author img

By

Published : Apr 5, 2022, 4:53 AM IST

Parties Corporate Donations: జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాలు గణనీయంగా పెరిగాయి. వ్యాపార సంస్థలు, కార్పొరేట్​ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో భాజపాకు అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు ఉన్నాయని అసోసియేషన్​ ఆఫ్​ డెమోక్రటిక్​ రీఫార్మ్స్​ (ఏడీఆర్​) తెలిపింది. 2017-18 నుంచి 2018-19 ఏడాదికి కార్పొరేట్ల విరాళాలు 109 శాతానికి పెరిగాయని పేర్కొంది.

2019-20 ఏడాదికి కాంగ్రెస్​ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.133.04కోట్లు, ఎన్సీపీకి రూ.57.086 కోట్లుగా ఉన్నాయి. కాగా.. సీపీఎంకు ఎలాంటి కార్పొరేట్ ఫండ్స్ రాలేదని ఏడీఆర్​ వెల్లడించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన దాతల గురించి భారత ఎన్నికల కమిషన్‌కు జాతీయ పార్టీలు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఏడీఆర్​ తెలిపింది. ఇందులో ప్రధానంగా ఐదు జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సీపీఎంలు ఉన్నాయి.

ఇదీ చదవండి: Fuel Prices: పెట్రోల్​ ధరల పెంపుపై రాహుల్, దీదీ ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.