దాదాపు ఏడాది తర్వాత భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. కొవిడ్ కారణంగా ఏడాదిగా ఈ భేటీని వాయిదా వేశారు. ఈ సమావేశానికి.. భాజపా ఎంపీలందరూ హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ సహా ఇతర సీనియర్ నేతలు వారికి దిశా నిర్దేశం చేశారు. పార్లమెంటు భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో నిర్వహించిన ఈ భేటీకి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రులు ఎస్ జైశంకర్, ప్రహ్లాద్ పటేల్, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు.
75వ స్వాతంత్య్ర వేడుకలు
ఈ ఏడాది 'అమృత్ మహోత్సవ్' పేరుతో నిర్వహిస్తున్న 75వ స్వాతంత్య్ర వేడుకల్లో భాజపా ఎంపీలందరూ పాల్గొనాలని మోదీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ వేడుకలను 75 వారాల పాటు, దేశవ్యాప్తంగా 75 చోట్ల నిర్వహించునన్నట్లు పేర్కొన్నారు. మార్చి 12న గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలోనూ ఎంపీలందరూ పాల్గొని ప్రజలకు సాయం అందించాలని మోదీ సూచించినట్లు జోషి చెప్పారు. వ్యాక్సినేషన్ కేంద్రాలకు చేరుకునే ప్రజలకు వాహనాలు ఏర్పాటు చేయాలని ఎంపీలకు దిశా నిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: తీరథ్ సింగ్ రావత్‌కు ఉత్తరాఖండ్ పగ్గాలు