ETV Bharat / bharat

హరియాణాలో లఖింపుర్‌ తరహా ఘటన- రైతులపైకి భాజపా ఎంపీ వాహనం! - హరియాణాలో లఖింపుర్ తరహా ఘటన

లఖింపుర్ హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న తరుణంలో.. అదే తరహా ఘటన హరియాణాలో(Haryana Farmers Attack) జరిగింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులపై భాజపా ఎంపీ నాయబ్​ సైనీ కాన్వాయ్ వాహనం దూసుకెళ్లిందని అక్కడున్న వారు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలైనట్లు తెలిపారు.

haryana farmers protest
హరియాణాలో రైతుల ఉద్యమం
author img

By

Published : Oct 8, 2021, 6:54 AM IST

హరియాణాలోని నారాయణ్‌గఢ్‌లో లఖింపుర్ ఖేరి(Lakhimpur kheri Incident) తరహా ఘటన(Haryana Farmers Attack) జరిగినట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకుచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆందోళన చేపడుతోన్న రైతులను ఢీ కొడుతూ భాజపా ఎంపీ నాయబ్ సైనీ(Nayab Saini News) కాన్వాయ్ వాహనం దూసుకెళ్లినట్లు నిరసనకారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి గాయాలైనట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని అంబాలాలోని నారాయణ్ గఢ్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

గురువారం ఉదయం సైనీ భవన్‌లో(Haryana Farmers Attack) జరిగిన ఓ కార్యక్రమానికి నాయబ్ సైనీతో పాటు హరియాణా గనుల శాఖ మంత్రి మూల్ చంద్ శర్మ, ఇతర నేతలు హాజరయ్యారు. భాజపా నేతలు వచ్చారన్న విషయం తెలుసుకున్న రైతన్నలు సైనీ భవన్‌ బయట గుమిగూడి నిరసన తెలిపారు. మరోపక్క కార్యక్రమం పూర్తి కావడంతో నేతలు అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో ఒక వాహనం నిరసనకారులను ఢీ కొట్టినట్లు వారు తెలిపారు. అది భాజపా ఎంపీ నాయబ్ సైనీ వాహనంగా వారు చెప్తున్నారు. ఈ ఘటనలో ఒక రైతుకు గాయాలైనట్లు వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

మరువకముందే..

ఉత్తర్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరి ఘటన మరువకముందే తాజా ఘటన జరగడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం రైతు చట్టాలకు వ్యతిరేకంగా లఖింపుర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కొన్ని వాహనాలు దూసుకెళ్లాయి. దాంతో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనకు కారణమైన నిందితుల్లో కేంద్రమంత్రి తనయుడు కూడా ఉన్నాడని తెలియడంతో అది కాస్తా దేశవ్యాప్తంగా సంచలనం అయింది. హత్యారోపణలు ఎదుర్కొంటోన్న ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చూడండి:

లఖింపుర్​ ఖేరి ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్​

లఖింపుర్​ ఘటనలో కేంద్ర మంత్రి తనయుడికి సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.