BJP MLA Convicted In Rape Case : మైనర్‌పై అత్యాచారం కేసులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక నిందితుడికి రూ.10 లక్షల జరిమానా వేసింది. దీంతో ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది.
ఇదీ జరిగింది?
దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దులార్ గోండ్ 2014 నవంబరు 4న ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు మైయర్పుర్ పోలీసులు నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. అప్పుడు గోండ్ ఎమ్మెల్యే కాదు కాబట్టి పోక్సో కోర్టులో విచారణ జరిగింది. పోక్సో ఆ తర్వాత జరిగిన ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించాడు. దీంతో ఈ కేసును పోక్సో కోర్టు సోన్‌భద్రలోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసుపై దర్యాప్తు జరిగిన కోర్టు నిందితుడు రామ్దులార్కు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేగాక గోండ్‌కు రూ.25 లక్షల జరిమానా వేసింది.
డిసెంబర్ 12న దుద్ది ఎమ్మెల్యే రామ్‌దులార్ గోండ్‌ను కోర్టు దోషిగా తేల్చిందని ప్రభుత్వ న్యాయవాది త్రిపాఠి తెలిపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు విధించిన శిక్షను తగ్గించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారని చెప్పారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని ఎమ్మెల్యే పూర్తిగా ఆదుకుంటానని కోర్టుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. మైనర్‌పై అత్యాచారం జరిగినప్పుడు నిందితుడి భార్య సర్పంచ్‌గా ఉండేవారని తెలిపారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడినప్పుడు చట్టసభ సభ్యులు సభ్యత్వాన్ని కోల్పోతారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆరేళ్ల పాటువారిపై అనర్హత వేటు ఉంటుంది. ఈ క్రమంలో దుద్ది ఎమ్మెల్యేకు ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు అత్యాచారం కేసులో 25 ఏళ్ల జైలు శిక్ష విధించడం వల్ల ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.
'ముఖ్తార్ అన్సారీకి ఐదున్నరేళ్ల జైలు శిక్ష'
బొగ్గు వ్యాపారి నందకిశోర్ రుంగ్టా సోదరుడు మహావీర్ప్రసాద్ను బెదిరించిన కేసులో గ్యాంగ్‌స్టర్, మాజీ శాసనసభ్యుడు ముఖ్తార్ అన్సారీకి ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించింది వారణాసి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు. అంతేకాకుండా అన్సారీకి రూ.10వేలు జరిమానా వేసింది. గత ఏడాదిన్నర కాలంలో ముఖ్తార్ అన్సారీకి 7 కేసుల్లో శిక్షలు పడ్డాయని లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అవధేష్ రాయ్ హత్య కేసులో ముఖ్తార్‌కు గతంలో జీవిత ఖైదు పడిందని చెప్పారు.
-
Uttar Pradesh: MP/MLA Court Varanasi sentences gangster turned politician Mukhtar Ansari to five and a half years rigorous imprisonment in a 26-year-old case of threatening the witness of the murder of a coal businessman Nand Kishore Rungta. In the last one and a half years,… pic.twitter.com/OZdkjAtwuX
— ANI (@ANI) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Uttar Pradesh: MP/MLA Court Varanasi sentences gangster turned politician Mukhtar Ansari to five and a half years rigorous imprisonment in a 26-year-old case of threatening the witness of the murder of a coal businessman Nand Kishore Rungta. In the last one and a half years,… pic.twitter.com/OZdkjAtwuX
— ANI (@ANI) December 15, 2023Uttar Pradesh: MP/MLA Court Varanasi sentences gangster turned politician Mukhtar Ansari to five and a half years rigorous imprisonment in a 26-year-old case of threatening the witness of the murder of a coal businessman Nand Kishore Rungta. In the last one and a half years,… pic.twitter.com/OZdkjAtwuX
— ANI (@ANI) December 15, 2023
కోర్టులోనే మహిళా జడ్జిపై లైంగిక వేధింపులు!- రంగంలోకి సీజేఐ- నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
షూ సోల్ కట్ చేసి గ్యాస్ బాంబులు ఫిక్స్- పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో విస్తుపోయే నిజాలు