దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు (Delhi Rain News) రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భాజపాకు నేత ఒకరు దిల్లీ నడి వీధుల్లో వర్షపు నీటిలో బోటులో తిరుగుతూ కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన కలను నెరవేర్చారంటూ దెప్పిపొడిచారు. వర్షం నీటిలో షికారు చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచగా ఆ వీడియో వైరల్ అయ్యింది.
భారతీయ జనతా యువ మోర్చాకు చెందిన తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ తనదైన శైలిలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
-
केजरीवाल जी मौज करदी pic.twitter.com/fn3zCWwhgF
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) September 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">केजरीवाल जी मौज करदी pic.twitter.com/fn3zCWwhgF
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) September 11, 2021केजरीवाल जी मौज करदी pic.twitter.com/fn3zCWwhgF
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) September 11, 2021
"ఈ సీజన్‌లో పడవ విహారం కోసం రిషికేష్ వెళ్దామనుకున్నా. కరోనా కారణంగా లాక్‌డౌన్ పెట్టడం వల్ల అది వీలు కాలేదు. కానీ, నా కలను నిజం చేస్తూ దిల్లీలోనే ఆ ఏర్పాట్లు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ధన్యావాదాలు చెబుతున్నాను. ఈ ఘనతను చాటుకుంటూ దిల్లీ నలుమూలాల బోర్డులు పెట్టుకోండి"
-తజీందర్ పాల్ సింగ్ బగ్గా, భాజపా యువమోర్చా నేత
మరోవైపు ఎప్పుడూలేని రీతిలో దిల్లీని ఈ ఏడాది వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలో చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే 383 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1944లో 417.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. మళ్లీ ఆ స్థాయిలో ఈ ఏడాదే వర్షం కురవడం గమనార్హం. సెప్టెంబర్ 1, 2 తేదీల్లోనూ ఇదే స్థాయిలో దిల్లీలో వర్షం కురిసింది.
ఇదీ చూడండి: Gujarat CM News: గుజరాత్ తదుపరి సీఎంపై నేడే నిర్ణయం!
ఇదీ చూడండి: కాంగ్రెస్ పరిస్థితిపై పవార్ చెప్పిన 'జమీందార్' కథ!