ETV Bharat / bharat

'చివరకు మిగిలేది మోదీ అబద్ధాల ఫ్యాక్టరీనే!'

మోదీ ప్రభుత్వంపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. కేంద్రం అన్నింటినీ అమ్మేస్తోందని, చివరకు మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ మాత్రమే మిగులుతుందని విమర్శించారు. అసోం, త్రిపురలో ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయిన భాజపా.. బంగాల్​లో అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు. మరోవైపు అంపన్ తుపాను సమయంలో కేంద్రం పంపిన నిధులను దీదీ మేనల్లుడు, ఆయన కంపెనీ మాయం చేసిందని హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.

TMC swindling Amphan relief fund in Bengal: Shah
'చివరకు మిగిలేది మోదీ అబద్ధాల ఫ్యాక్టరీనే!'
author img

By

Published : Mar 23, 2021, 10:12 PM IST

కేంద్రం అన్నింటినీ అమ్మేస్తోందని ​బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. చివరకు మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ మాత్రమే మిగులుతుందని ఎద్దేవా చేశారు.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పురులియాలో ర్యాలీలో పాల్గొన్నారు మమత. కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. బంగాల్​లో అధికారంలోకి వస్తే తాము చేయబోయే పనుల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న భాజపా.. అసోం, త్రిపురలో ఎన్నికల హామీలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే పరిస్థితి తలెత్తిందని ధ్వజమెత్తారు.

ఎప్పటిలానే ర్యాలీలో చండీ శ్లోకాలు పఠించారు మమత. మత రాజకీయాలకు పాల్పడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బయటి నుంచి వచ్చిన గూండాలకు ఓటు వేయవద్దని సూచించారు. తాను బెందిరింపులకు భయపడబోనని, ఎదిరించి పోరాడతానని ఉద్ఘాటించారు.

'అంపన్​ తుపాను​ నిధులు స్వాహా'

బంగాల్​లో అంపన్​ తుపాను అనంతరం కేంద్రం పంపిన రూ.వేల కోట్ల సాయాన్ని మమత సర్కార్​ మాయం చేసిందని భాజపా సీనియర్​ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. టీఎంసీ 'ముడుపుల సంస్కృతి'పై ఆయన ధ్వజమెత్తారు. మమత మేనల్లుడు, ఆయన కంపెనీ కేంద్రం పంపిన నిధులను స్వాహా చేసిందని ఆరోపించారు. బంగాల్​లో భాజపా అధికారంలోకి వస్తే దీనిపై కమిటీ వేసి దర్యాప్తు జరిపిస్తామని గొసాబాలో నిర్వహించిన ర్యాలీలో అమిత్​ షా హామీ ఇచ్చారు.

" అంపన్ తుపాను బాధితులకు కేంద్రం రూ.10వేల కోట్లు పంపింది. మీకు ఒక్క రూపాయి సాయమైనా అందిందా? ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? మేనల్లుడు, ఆయన కంపెనీ స్వాహా చేసింది. దీదీ ఆమె మేనల్లుడి కోసమే పని చేస్తారు తప్ప.. ప్రజల కోసం కాదు. ఆయనను సీఎం చేయడం గురించి మాత్రమే ఆమె ఆలోచిస్తారు. దీదీ మేనల్లుడు బంగాల్​ తదుపరి సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా? వద్దనుకుంటే భాజపాకు ఓటు వేయండి. టీఎంసీలోని గూండాలు, సిండికేట్లకు భాజపా చెక్​ పెడుతుంది."

--హోంమంత్రి అమిత్ షా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.